ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ వ్యాప్తి తో చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా వణికిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్రమత్తమైపోయింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలకు  సిద్ధమైంది. 

 

 

 ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు అన్నింటికీ మూసివేయాలని  ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్ . ఇక వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కరోనావైరస్‌(కోవిడ్‌-19)నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలకు బంద్‌ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా సినిమా థియేటర్లు, మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌ సెంటర్లు, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

 

 

పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ దర్శనాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసున్నారు. అంతేకాకుండా ఎక్కడ ప్రజలు గుమిగూడి ఉండకూడదు అంటూ ఈ సందర్భంగా జగన్ సర్కార్ సూచించింది. ఇక వ్యక్తిగత పరిశుభ్రత పాటించి  కరోనా  వైరస్ దరి చేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి జగన్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది. ఇకపోతే ఈ మహమ్మారి వైరస్ కు సరైన విరుగుడు లేదని నివారణ ఒక్కటే మార్గం అంటూ అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచించడంతో ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఎంతోమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: