దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులను మంజూరు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు సైతం రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలోను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం విద్యార్థులు పౌష్టికాహారానికి ఎట్టి పరిస్థితులల్లోను దూరం కాకూడదని ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ పథకం అమలు కొరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు చేసింది. కేంద్రం వండిన ఆహారం నేరుగా ఇంటికే పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతోంది. 
 
ఒకవేళ వండిన ఆహారం అందించటంలో ఇబ్బందులు ఎదురైతే రాష్ట్రప్రభుత్వాలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారులు మీడియాతో మాట్లాడుతూ తమ నిబంధనల్లో అనుకోని పరిస్థితులలో సెలవులు ప్రకటిస్తే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ఉందని పేర్కొన్నారు. 
 
ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యల దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రతిఫలాలు అందించటానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం క్లిష్ట పరిస్థితుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు దిశగా చర్యలు చేపట్టటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.దేశంలో కరోనా బాధితుల సంఖ్య 173కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: