యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ ని వదలడం లేదు.. ఇప్పటికే నలుగురు మరణించగా 150 కేసులకు పైగా నమోదు అయ్యాయి.  కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.   దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని కేంద్రం సూచించింది. అంతే కాదు ఇక నుంచి క 10సంవత్సరాల లోపు చిన్నారులు, 65ఏళ్లు దాటిన పెద్దలు అందరూ ఇళ్లు వదిలి రావొద్దని కేంద్రప్రభుత్వం సూచించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించబడ్డాయి.

 

వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకే ప్రమాదం ఉన్నందును ప్రజలు ఎక్కువగా ఒక చోట చేరకుంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూల్స్,కాలేజీలు,సినిమా థియేటర్లు,మాల్స్ అన్నింటినీ మూసివేశారు.  దేశంలో ఇప్పటివరకు నాలుగు కరోనా మరణాలు సంభవించాయి. అయితే మరణించిన ఈ నలుగురు విదేశాల నుంచి భారత్ కు తిరిగొచ్చిన వృద్ధులే.  తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం కఠిన చర్యలను ప్రకటించింది. అన్ని రెస్టారెంట్లను మూసేయాలని, సామాజిక కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది.

 

ఐఐటీ ఢిల్లీతో సహా అన్ని విద్యా సంస్థలను మూసేయాలని తెలిపింది.  ఈ నెల 31 వరకు ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెస్టారెంట్లలో భోజనం, టిఫిన్ చేయడంపై నిషేధం విధించామని, అయితే ఆహార పదార్థాలను ఇళ్ళకు తీసుకెళ్ళి తినవచ్చునని చెప్పారు.  కరోనా వైరస్ బాధితుల కోసం ఢిల్లీలో 768 పడకలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం 57 పడకలపై వ్యాధిగ్రస్థులు చికిత్స పొందుతున్నారన్నారు.  ఢిల్లీలో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒకరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు కోలుకున్నారని తెలిపారు. మిగిలిన ఆరుగురి పరిస్థితి బాగుందన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: