కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు వేలల్లో మనషులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే లక్షలాది మందికి కరోనా వైరస్ సోకింది. ఇక దీని దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు మనదేశంలో కూడా జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వాలు కూడా ప్రజలని బయట ఎక్కువ తిరగొద్దని, కరోనా రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే మన ఏపీలో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యి, తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే సీఎం జగన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు, సినిమా హళ్ళు, మాల్స్ మూసివేయించారు. అయితే ఈ వైరస్ గురించి చెబుతూ... ఆయా రాష్ట్రాల సీఎంలతో పాటు, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.

 

కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్ ఒక్కరే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వైరస్ ప్రభావంపై ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పారు. కానీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మాత్రం మీడియా సమావేశం పెట్టి ఏపీలో కరోనా ప్రభావం ఎలా ఉంది? దీని గురించి ప్రజలు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఏం చేయాలి? అనే విషయాల గురించి మాత్రం మాట్లాడలేదు.  అయితే రాష్ట్రంలో ఆళ్ళ నానినే ఆరోగ్య శాఖ మంత్రి అని పెద్దగా ఎవరికి తెలియదని అర్ధమైంది.

 

అందుకనే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏపీ నెటిజన్లు అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఆయన ఎందుకు బయటకు రావడం లేదంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఓ వైపు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అంత కష్టపడుతున్న ఏపీ మాత్రం బయటకు రావడం లేదంటూ విమర్శలు చేశారు. ఇటు మీడియాలో కూడా ఆళ్ళ నాని ఎందుకు మీడియా సమావేశాలు పెట్టి ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం లేదంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాయి.

 

ఇలా అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో చివరికి ఆళ్ళ నాని ప్రెస్ మీట్ పెట్టి, జాగ్రత్తలు చెప్పి, కరోనా రాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించారు. మొత్తానికైతే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలమందికి ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: