ప్రజలు స్వచ్చందంగా కర్ఫ్యూ విధించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ పై మీడియాతో మాట్లాడారు. మీ జీవితంలో కొన్ని వారాలు త్యాగం చెయ్యాలని మోడీ కోరారు. వ్యాపారం అయినా ఉద్యోగం అయినా ఇంటి నుంచి చేసుకోవాలని మోడీ సూచించారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలని అన్నారు. కరోనా కన్నా సీరియస్ అంశం ఏదీ లేదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుందని వ్యాఖ్యానించారు. 

 

ఉదయం 7 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బయటకు రావొద్దని మోడీ సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత స్వచ్చత పాటించాలని మోడీ సూచించారు. దేశంలోని ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని అన్నారు. కొన్ని రంగాలు ఇళ్ళ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్లు, నర్సులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని కొనియాడారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఉన్నాయని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా బాధితులు అందరిని ఐసోలేషన్ కి తరలిస్తున్నామని అన్నారు. 

 

నీ స్వచ్చతే జాతి స్వచ్చత అన్న ఆయన... కరోనా మనకు రాకుండా చూడాలి, ఇతరులకు సోకకుండా చూసుకోవాలని అన్నారు. కరోనా అన్ని దేశాలకు సోకింది మన దేశం అతీతం కాదని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు. సమూహాలకు దూరంగా ఉండమని కోరిన ఆయన... సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చూడాలని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఆయన... సంకల్పం నిబద్దత చాలా అవసరమని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు.  సోషల్ డిస్టన్సింగ్ చాలా అవసరం అన్నారు. మార్చ్ 22 వ తేదీన ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ఇప్పటి వరకు కరోనా కు వ్యాక్సిన్ లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: