రోజురోజుకు కరోనా వైరస్ భారత్ లో శరవేగంగా వృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్లో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతున్న తరుణంలో తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాని నరేంద్ర. దేశంలోని ప్రజల ఆరోగ్యమే దేశ ఆరోగ్యం అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరూ కరోనా వైరస్ పై  పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కు సరైన వ్యాక్సిన్ లేదని... ఎవరు కనుగొన లేదు అంటూ వ్యాఖ్యానించారు  నరేంద్ర మోడీ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదటి ప్రపంచ యుద్ధ పరిస్థితులు వచ్చాయి అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 అయితే ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ తో పోరాటం చేస్తోంది అంటూ ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే దేశం ఎదుర్కోలేదు అంటూ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరి ప్రాణాలను రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా వైరస్ బారినపడి... పోరాటం  చేస్తూన్నాయని.. కరోనా  వైరస్ కి మన దేశం అతీతం  కాదు అంటూ తెలిపారు. 

 

 

 అయితే ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేనందున ప్రస్తుతం నివారణ ఒక్కటే మార్గం అంటూ ఈ సందర్భంగా మోడీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఆదేశాలను అందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇది కేవలం ఒక్కరి సమస్య మాత్రమే కాదని ఇది జాతి అందరి సమస్య అంటూ  ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అందరూ సమిష్టిగా కరోనా  వైరస్ పై  పోరాడితేనే విజయం సాధించగలం అంటూ  ఈ సందర్భంగా తెలిపారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: