మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది. జగన్ సర్కార్ అప్రమత్తంగా ఉంటూ వైరస్ సంక్రమణని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసిన వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

 


అయితే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కేవలం 2 మాత్రమే నమోదయ్యాయని, దానికి కారణం ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధక చర్యలను ఎల్లవేళలా చేపడుతుందని ఆయన అన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్, దేవుని గుళ్ళు మసీదులు ఈనెల 31 వరకు మూసి వేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలెవరూ ఇంటి నుండి బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ ప్రత్యేకంగా తీసుకోమని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. 

 

 


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బార్లు రెస్టారెంట్లులో ప్రజల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేటట్టు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. టీటీడీ తో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాలలో భక్తులని అనుమతించబోమని.. కానీ నిత్య నైవేద్యాలు, ధూపదీప కార్యక్రమాలు ఎప్పటిలాగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే పెళ్లిళ్లు ఫంక్షన్లు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరమని సూచించారు. ఒకవేళ వాయిదా వేసుకోవడం అసాధ్యమైతే పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకే వద్దకు వచ్చేలాగా చేయకుండా తక్కువ మంది ప్రజలలో ఫంక్షన్లు పెళ్లిళ్లు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఐటి ఉద్యోగుల గురించి మాట్లాడుతూ తమని ఇంటి దగ్గర ఉండే వర్క్ ఫ్రొం హోమ్ పనులు చేసుకోమని సలహా ఇచ్చారు. అలాగే బస్సు రవాణా గురించి, ఎక్కువ మంది ప్రజలను తరలించే వాహనాల గురించి తగిన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: