ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశాన్ని కూడా వణికిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అలాగే మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో పీఎం ప్రధాని మోదీ భారతదేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

IHG

 

ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తం ఒక పెద్ద సమస్యను ఎదుర్కుంటుంది అని ప్రధాని మోదీ అన్నారు. అయితే.. కరోనా వైరస్ మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కంటే అతి పెద్ద విపత్తును మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నామని మోదీ తెలిపారు. వివిధ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి నుంచి ఇప్పుడే బయటపడే అవకాశం లేదన్నారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

IHG

అయితే.. ప్రధాని మోదీ కరోనా వైరస్ ను అదుపుచేయటానికి ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా., గత రెండు నెలలుగా 130 కోట్ల మంది భారతీయులం కలిసి కట్టుగా కరోనా పై పోరాడుతున్నామన్నారు.

 

IHG and modi

 

అయితే భారత్ లో కరోనా రెండో దశకు చేరుకుందని, ఇంతకుముందే.. ఆయన అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైరస్ ను ఈ దశలోనే కట్టడి చేస్తేనే భారత్ కు పెను ముప్పు తప్పుతుందని లేదంటే భారత్ కు ఆర్ధిక నష్టం తప్పదని ఇంకా ఊహించని రీతిలో ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేళ్ల లోపు పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. కాగా., పలు కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా విమానాల సర్వీసును కూడా రద్దు చేసింది. ప్రజలు పలు జాగ్రత్తలను పాటించాలని బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని, శానిటైజర్ లను దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: