దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న వేళ.. ప్రధాని మోడీ మరోసారి ప్రజలకు భారత్ సత్తా చాటాలని పిలుపు ఇచ్చారు. అందరం కలసికట్టుగా పోరాడి కరోనా భూతాన్ని తరమిమేద్దామని పిలుపు ఇచ్చారు. కరోనాను కట్టడి చేయాలంటే సామాజిక నిర్బంధమే సరైన మందు అని ఆయన వివరించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు.

 

 

ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదన్న మోడీ.. . ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన ముందున్నవి రెండే మార్గాలు అని చాటారు. అవి దృఢ సంకల్పం, కలిసి పనిచేయడం. ఏకాంతంగా ఉండటం వల్ల ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చని మోడీ సూచించారు. . ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని.. . ఓ విస్ఫోటనంలా విరుచుకుపడుతున్న కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని ఆయన ప్రజలను హెచ్చరించారు.

 

 

కరోనా వైరస్‌ నివారణకు ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. కరోనా వైరస్‌ కేసులు దేశంలో పెరుగుతున్న వేళ ఆయన ప్రజల ముందుకొచ్చారు. కరోనాను అడ్డుకొనేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని మోడీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

 

ఈ ప్రపంచ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఊరట లభించే అవకాశం లేదని మోడీ హెచ్చరించారు. అవసరం లేకుండా ఇంట్లోనుంచి కాలు బయట పెట్టొద్దని మోడీ సూచించారు. ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: