కీలకమైన సమయాల్లోనే ప్రధాని మోడీ బయటకు వచ్చి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే చేశారు. గతంలో నోట్ల రద్దు సమయంలోనూ... కశ్మీర్ విభజన సమయంలోనూ ఇలాంటి మరికొన్ని కీలక సమయాల్లో మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కానీ ఇప్పుడు ప్రసంగించిన సందర్భం మాత్రం దేశానికి వణుకుపుట్టిస్తున్న కరోనా కట్టడి గురించి.

 

 

కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో మోడీ ప్రజలకు వివరించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ వ్యాప్తి గత రెండు నెలలుగా కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న మోడీ.. దీని నుంచి ఇప్పుడిప్పుడే ఊరట లభించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రజలను అందుకు సన్నద్దం చేసే ప్రయత్నం చేశారు.

 

 

ఇది రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద విపత్తుగా మోడీ వర్ణించారు. ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండటం అవసరం ఉందని హెచ్చరించారు. అందరం చేయిచేయీ కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. కొద్ది వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నానంటూ ప్రజలను మోడీ కోరారు. అవసరం లేకుండా ఇంట్లోనుంచి కాలు బయట పెట్టొద్దని... ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలని పలుసార్లు విజ్ఞప్తి చేశారు.

 

 

ఇప్పటికైనా భారతీయులు కరోనా సీరియస్ నెస్ అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలి. చైనా స్ఫూర్తితో ఇండియా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: