కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రోజు దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ ఆదివారం అనగా మార్చి 22న ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటికి రాకూడదని దృఢ నిశ్చయం తీసుకోవాలని ఆయనన్నారు. ప్రజల కోసమే ప్రజలు తీసుకునే జనతా కర్ఫ్యూ కరోనా మహమ్మారి పై పెద్ద యుద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేశం లోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుండి బయటకి రాకుండా ఒక జనతా కర్ఫ్యూ ని పాటిద్దామని ఆయన అన్నారు.




కరోనా వైరస్ నిరోధక చర్యలను ప్రపంచ దేశాలు సీరియస్ గా, క్రమశిక్షణగా పాటిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కరోనా వైరస్ ని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరి సహాయం కావాలని... అందరి దృఢ సంకల్పం, కలిసి పని చేసే ఆలోచనే కరోనా వైరస్ కి అసలు సిసలైన ఔషధమని మోడీ అన్నారు. ఇతరు లతో కలవకుండా ఎవరికి వారు ఏకాంత మైన సమయాన్ని గడపడం వలన కరోనా వైరస్ సంక్రమణ పూర్తిగా తగ్గిపోతుందని, ప్రస్తుతం ఇవి పాటించడం తప్ప మిగతా మెడిసిన్లు ఏవి శాస్త్రవేత్తలు ఇంత వరకు కనిపెట్ట లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రించలేని స్థితిలో కరోనా వైరస్ విస్పోటనం లాగా మారుతుందని ఆయన అన్నారు.




దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రపంచ కరోనా మహమ్మారి నుండి సమీప భవిష్యత్తులో ఉపశమనం లభించడమే చాలా కష్టమేనని ఆయన అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కంటే అతి భయంకరమైన వైరస్ ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రతి ఒక్కరి సహాయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ఇప్పటికే విదేశీయులను భారతదేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వడం లేదు ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: