కరోనా.. దీని గురించి మొదట్లో ప్రపంచ దేశాలు లైట్ గా తీసుకోవడమే ఇప్పుడు ప్రపంచం కొంప ముంచింది. మొదట్లో ఇదేదో చైనా దేశం గోల అనుకున్నారు. ఆ చైనా వాళ్ల తిండి వల్లే వాళ్లకు అలా వచ్చిందని ఎగతాళి చేశారు. చైనా దాటి మిగిలిన దేశాలకు రాదని ఫీలయ్యారు. ఒక విధంగా చైనా వార్తలను చూస్తూ జనం ఎంజాయ్ చేశారు. వాళ్లకు అలాగే కావాలని శాడిజం ఫీలయ్యారు.

 

 

కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. చైనా నుంచి ఇటలీ, స్పెయిన్, ఇరాన్, అమెరికా.. ఇలా ఒక్కోదేశాన్ని ఈ వైరస్ కబళిస్తోంది. అందుకే ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఈ మహమ్మారి అప్పుడే వదలిపెట్టదని.. కొన్ని వారాల పాటు మనకు కరోనా తిప్పలు తప్పవని ప్రజలను అప్రమత్తం చేశారు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు.

 

 

ఈ కరోనాను అరికట్టేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పడే ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. అందుకే వచ్చే కొద్ది వారాలు మీ సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా అంటూ మోడీ ప్రజలను అలర్ట్ చేశారు. అందరం చేయి చేయి కలిపి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలన్నారు. ఈకరోనా కబలిస్తున్న దేశాల్లో మొదట బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నా..రాను రాను సంఖ్య పెరిగిపోతుందని ప్రధాని గుర్తు చేశారు.

 

 

మోడీ చెప్పినట్టు ఇప్పటికే దాదాపు చాలా దేశాలు అంతర్జాతీయ సరిహద్దులు మూసేశాయి. ప్రపంచమే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తగిన విధంగా జాగ్రత్త పడకపోతే... మానవ మనుగడుకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. అందుకే మోడీ చెప్పింది అక్షరాలా నిజంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: