దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని మోడీ కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వారం రోజులు పని చేస్తే.. మరో వారం రోజులు సెలవు తీసుకోవచ్చని తెలిపారు. అయితే ఈ అవకాశం అందరు ప్రభుత్వ ఉద్యోగులకు కాదు సుమా.. గ్రూపు సీ, గ్రూపు డీ ఉద్యోగులు ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే జనం ఒకరినొకరు కలవడం తగ్గించాలంటున్న మోడీ.. అందుకు విరుగుడుగా ఈ వారం విడిచి వారం డ్యూటీ విధానం ప్రవేశపెట్టారు.

 

 

ఉద్యోగుల విషయంలో మోడీ ప్రైవేటు కంపెనీలకూ కొన్ని సూచనలు చేశారు. వీలైనంత వరకూ వర్క ఫ్రమ్ హోమ్ విధానం అవలంబించాలని సూచించారు. కరోనాను ఇకపై తేలిగ్గా తీసుకోవద్దన్న మోడీ.. బాధితులను ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని వివరించారు. కరోనాతో పోరాడటానికి సరైన సంకల్పంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని మోడీ పిలుపునిచ్చారు.

 

 

మనం స్వయంగా ఆరోగ్యంగా ఉండటం అంటే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడమేనని ప్రధాని మోడీ అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే..ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీసూచించారు. సంకల్పం, కనీస జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చన్నారు. ఒంటరిగా ఉండటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చంటున్నారు మోడీ.

 

 

వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనాను ఎదుర్కొనేందుకు మన ముందున్న మార్గాలు ఒకటి దృఢ సంకల్పం, రెండోది కలిసి పనిచేయడమని మోడీ అన్నారు. ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు చాలా వరకూ వర్క ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: