మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు హీరోయిన్ సమస్య వచ్చి పడింది. ఇప్పటివరకు ఈ సినిమాకు హీరోయిన్ సెట్ అవ్వలేదు. 

 

 

 మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేయ్యలి  కానీ... ఏకంగా మెగాస్టార్ సినిమా కి హీరోయిన్ కొరత ఏర్పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా  మొదట చిత్రబృందం త్రిషను సెలెక్ట్ చేసినప్పటికీ కొన్ని విభేదాల కారణంగా త్రిషసినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత త్రిష ప్లేస్ లో కాజల్ ని తీసుకోవాలన్న అది కుదరలేదు. ఎందుకంటే కాజల్ చిరంజీవి సినిమా కోసం  ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా  అనుష్కను తీసుకుందాం అనుకుంటే ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కమీట్ కావడం ద్వారా అనుష్క కూడా ఈ సినిమా చేయలేక పోతుంది. 

 

 

 ఇదంతా చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ  కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు... ఇప్పట్లో హీరోయిన్ కష్టాలు మాత్రం తీరేలా  కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి సరసన కుర్ర హీరోయిన్లు సెట్ అవ్వదు. దీంతో ఈ సమస్య మరింతగా ఈ సినిమాను వేధిస్తోంది. అయితే చిరంజీవి సినిమాలు హీరోయిన్ లను వెదకడానికి దర్శకనిర్మాతలకు సవాల్ గా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సగం షూటింగ్  పూర్తయినప్పటికీ హీరోయిన్ మాత్రం సెలెక్ట్ కాలేదు. చూడాలి మరి చిత్ర బంధం చివరికి ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తుంది అన్నది. ఈ సినిమాలో  హీరోయిన్ రెజీనా ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్ర పోషించనున్నారు  .

మరింత సమాచారం తెలుసుకోండి: