కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రజలను చంపుతోంది. దీంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జనం బయటకు రావడం లేదు. ప్రభుత్వాలే హౌజ్ అరెస్టులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనేక వ్యాపారాలు పూర్తిగా నష్టపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల తలకిందులవుతున్నాయి.

 

 

మరి డిమాండ్ ఉంటేనేగా సప్లయ్ ఉండేది. ఇలాంటి సమయంలో ఆ ప్రభావం ఇండియాపైనా పడుతోంది. అందుకే కొన్నాళ్ల క్రితం వరకూ 40 వేలు దాటిని బీఎస్సీ సెన్సెక్స్ ఇప్పుడు 30 వేల దిగువకు పడిపోయింది. ఇది ఇంకా ఎంత వరకూ పడుతుందో తెలియదు. అందుకే దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకు పోకుండా ఏం చేయాలనే విషయంలో మోడీ మల్లగుల్లాలు పడుతున్నారు.

 

 

ఆర్థిక విషయాలను అద్యయనం చేసి.. తగిన ప్రణాళిక రచించేందుకు ఆయన ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో దేశంలోని ఆర్థిక వేత్తలు, రాష్ట్రాల నుంచి కూడా నిపుణులు ఉంటారట. కరోనా ప్రభావం ఇంకా కొన్నాళ్లు తప్పకుండా ఉంటుందని భావిస్తున్న మోడీ సర్కారు అందుకు అనువైన వ్యూహం కోసం కసరత్తు చేస్తోంది.

 

 

కరోనా దెబ్బతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వమే ప్రజలను బయటకు రావద్దని చెబుతోంది. ఇలాంటి సమయాల్లో అనేక రంగాలు ఆర్థికంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. చిన్న వర్తకులు, ఇతర వ్యాపారులు దారుణంగా నష్టపోతారు. అందుకే ఇందుకు అనువైన వ్యూహం రచించేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: