ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లక‌లం శృష్టిస్తున్న క‌రోనావైర‌స్‌ని క‌ట్ట‌డి చేయ‌డానికి దేశ ప్ర‌ధాని న‌డుంక‌ట్టారు. అందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలని అంద‌రూ సంయ‌మ‌నంతో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...ఈ వైర‌స్ క‌ట్ట‌డి కోసం దేశ ప్ర‌జ‌లంతా 22వ తారీఖున (ఆదివారం) అంద‌రూ జ‌న‌తా కర్య్ఫూను పాటించాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 7గంట‌ల నుంచి రాత్రి 9గంట‌ల వ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌డం మంచిద‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అంద‌రూ దీన్ని జాగ్ర‌త్త‌గా పాటిస్తే క‌చ్చితంగా నివారించ‌వ‌చ్చ‌న్నారు. ఈ జ‌న‌తా కర్య్ఫూను ఆచ‌రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌న్నీ కూడా క‌లిసి క‌ట్టుగా రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

 

ఇక ఈ మ‌హమ్మారిని అరిక‌ట్టేందుకు దేశ ప్ర‌భుత్వాలు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి వ‌స్తుంది. వీలైనంత వ‌ర‌కు బ‌య‌ట‌కు ఎక్కువ‌గా తిర‌గ‌క‌పోవ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు. అలాగే ఎంత అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాలైనా స‌రే ర‌ద్దు చేసుకోమంటున్నారు. ఎక్కువ‌గా మ‌నుషులు ఉన్న చోటికి వెళ్ల‌క‌పోవ‌డం చాలా మంచిది. వీలైనంత‌వ‌ర‌కు ఒంట‌రిగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ మ‌హ‌మ్మారి నుంచి కాపాడేందుకు  శాస్త్ర‌వేత్త‌లు ఎలాంటి మార్గం క‌నిపెట్ట‌లేక‌పోయారు. అందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డం చాలా మంచిది మ‌న జాగ్రత్త‌లు మ‌న‌మే తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

 

అయితే ఈవైర‌స్‌ని ఎదుర్కోవ‌డం అనేదిచిన్న విష‌యం కాద‌ని అన్నారు. గ‌త రెండు నెల‌లు ఈ వైర‌స్ దేశ ప్ర‌జ‌లంద‌రినీ అత‌లాకుత‌లం చేస్తుంది. ప్ర‌పంచ మాన‌వాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొటోంది. కొద్ది వారాల పాటు మీరంద‌రూ చాలా జాగ్ర‌త్త‌తో మీ స‌మ‌యాన్ని నాకు ఇవ్వాల‌ని ఆయ‌న విన్న‌పించుకున్నారు. ఇక అందులోనూ 12 ఏళ్ళ వ‌య‌సు లోప‌ల  ఉన్న చిన్న పిల్ల‌ల‌ను ఇంకా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌న్నారు. వీలైనంత‌వ‌ర‌కు పిల్ల‌ల‌కు బ‌యట ఫుడ్ తినిపించ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాద‌న్నారు. కుదిరినంత వ‌ర‌కు ఇంట్లోనే ఉంటూ పిల్ల‌ల‌కు ప్ర‌తి క్ష‌ణం చేతులను శుభ్రంగా క‌డిగిస్తూ జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌న్నారు. కొంచం ద‌గ్గు, జ‌లుబు ఉన్నా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: