తెలంగాణ లో కరోనా బాధితుల సంఖ్య  ప్రస్తుతం 16కు చేరుకుంది. నిన్న ఒక్క రోజే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు లండన్ నుండి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  గదుల్లో ఉంచి చిక్సిత అందిస్తున్నారు. ఇదిలావుంటే నిన్న మరోసారి కరోనా పై  మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..   కరోనా ను అరికట్టడానికి  అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
 
అందులో భాగంగా ఈనెల 31 వరకు తెలంగాణ లోని అన్నిరకాల విద్యాసంస్థలు మూసి వుండనుండగా 10 వ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయి  అలాగే ఈనెల 28వరకు బహిరంగ సభలు ,ర్యాలీలు , ఉత్సవాలకు అనుమతి  లేదు వీటితోపాటు పార్కులు , స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు , వ్యాయామశాలలు , జూ పార్కులు మూసివుంటాయి. మాల్స్ ,సూపర్ మార్కెట్లు ఇతర దుకాణాలు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా  నిన్న కరోనా గురించి మొదటి సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కు మందు లేకపోవడం తో దీన్ని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. 
 
ఓవరాల్ గా దేశంలో మొత్తం ఇప్పటివరకు 170 కరోనా కేసులు నమోదుకాగా అందులో నలుగురు మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధిత దేశాల విషయానికి వస్తే ... ప్రస్తుతం కరోనా దెబ్బ కు ఇటలీ వణికిపోతుంది. ఈవైరస్ పుట్టింది చైనా లో అయినా ఇటలీ లో దీని బారిన పడి చనిపోయినవారు ఎక్కుమంది ఉండడం గమనార్హం.. ఇటలీ లో ఇప్పటివరకు 41035 మంది కరోనా బారిన పడగా అందులో 3405 మంది చనిపోయారు. చైనా లో ఇప్పటివరకు 80,928 కరోనా కేసులు నమోదు కాగా 3000 పైగా మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: