మనదేశంలో కరోనా వైరస్ అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. హైదరాబాదులో ఒక్కడితో మొదలైన కరోనా ప్రస్థానం ప్రస్తుతం 14 పాజిటివ్ కేసులకు చేరగా.... ఈరోజే అనూహ్యరీతిలో కరీంనగర్ లో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నెల ఆఖరి వరకు విద్యాసంస్థలు అన్నింటికీ సెలవు ప్రకటించగా బయట ఆఫీసులలో పనిచేసే వారికీ కూడా ఇంటి దగ్గర నుండి పని చేసేందుకు వీలు కల్పించాలని అన్నీ సంస్థలను ఆదేశించాయి.

 

 

ఇన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందేందుకు ఏదో ఒక దారి చూసుకుంటూనే ఉంది. తాజాగా నేడు ఆంధ్రప్రదేశ్లో లో బయటపడ్డ ఒక కరోనా పాజిటివ్ వ్యక్తి ఈనెల అనగా మార్చి 11 తేదీన హైదరాబాదులోని పంజాగుట్ట ఏరియా లో నెక్స్ట్ గల్లేరియా మాల్ కు విచ్చేశాడు. విషయాన్ని తెలంగాణ ప్రభుత్వమే ప్రకటించగా... డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోజున మాల్ ను సందర్శించిన మరియు విచ్చేసిన ప్రజలందరినీ ఎవరికివారు ఇంట్లో ఉండి సెల్ఫ్ క్వారంటెన్ చేసుకోవాల్సిందిగా కోరారు.

 

 

అలాగే రోజున ఎవరైనా పంజాగుట్ట ఏరియా లో ఎక్కువ సమయం గడిపి మరియు కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారంతా తమ స్వీయ పర్యవేక్షణలో తమ ఆరోగ్య స్థితిని గమనించడం తప్పనిసరి. అలాగే శ్రీనివాస్ గారు ఎవరికైనా కరోనా వల్ల వచ్చే లక్షణాలు ఎక్కువ అయితే తక్షణమే హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేరివలసిందిగా కూడా సూచించారు. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ఎవరి ఇళ్లలో వారు ఉంటే అంతా క్షేమంగా మరియు సురక్షితంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: