ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు నిర్భ‌య దోషులు న‌లుగురు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివరికి భారత సర్వోన్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నిర్భ‌య దోషులు న‌లుగురు వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో న్యాయ మూర్తులు జ‌స్టిస్ ఆర్ భానుమతి, జ‌స్టిస్‌ అశోక్ భూషణ్, జ‌స్టిస్ ఆర్‌. బోప‌న్న‌ల‌తో కూడిన‌ ధర్మాసనం వీరికి ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు దోషులను ఉరి తీశారు.



దేశ‌వ్యాప్తంగా ప‌ది సంవ‌త్స‌రాలుగా వార్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన నిర్భ‌య దోషుల‌కు ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ఉద‌యం ఉరి శిక్ష అమ‌లు చేయ‌డంతో సంబ‌రాలు ప్రారంభ మ‌య్యాయి. నిర్భయ కుటుంబ స‌భ్యులు, బంధువులు, అభిమానులు ఉద‌య‌మే తిహార్ జైలు ద‌గ్గ‌ర సంబ‌రాలు చేసుకున్నారు. ఇక
మీర‌ట్ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక త‌లారి వీరు న‌లుగురికి ఉరి శిక్ష అమ‌లు చేశారు. దేశ చ‌ర‌త్ర‌లోనే న‌లుగురికి ఒకేసారి ఉరి శిక్ష అమ‌లు చేయ‌డం ఇదే ప్ర‌ధ‌మం అయ్యింది. నిర్భ‌య దోషుల‌ ఉరి దేశ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేక మైందిగా మిగిలి పోయింది.



అయితే నిర్భయ దోషులకు ఉరి తీసే ముందు.. వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు ఐదు నుంచి పది నిమిషాలు అనుమతివ్వాలని వీరి తరఫున ముందు నుంచి వాదిస్తున్న న్యాయవాది ఏపి. సింగ్‌ కోరారు. అయితే దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా స్పందిస్తూ ఇందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని స్పష్టం చేశారు. ఇక సుప్రీం తీర్పు త‌ర్వాత ఉరి శిక్ష‌ పట్ల హర్షం నిర్భ‌య త‌ల్లి ఆషాదేవి హ‌ర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష తో తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింద‌ని ఆమె చెప్పారు. నిర్భయ తండ్రి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: