భారత్ లో కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యమవుతుందా...? మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి సహకారం ఉంటుందా...? బయటకు రాకుండా ఉంటారా...? ఏమో చెప్పలేని పరిస్థితి. మన దేశంలో జనాలకు కాస్త వితండ వాదం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్తే మేము చేసేది ఏంటీ అనే బాణీలో ఉంటారు కొందరు. దీనితో ప్రభుత్వాలు కాస్త ప్రచారం ఎక్కువ చేస్తూ భయపెట్టే ప్రయత్నాలు చేస్తాయి. 144 సెక్షన్ ఉన్నా సరే బర్తడే పార్టీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ప్రమాదం అని చెప్పినా సరే వినే పరిస్థితి ఉండదు. 

 

దీనితో ప్రభుత్వాలకు కరోనా వైరస్ కట్టడి అనేది ఇప్పుడు కత్తి మీద సాము అంటున్నారు పరిశీలకులు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు కాబట్టి కట్టడి చేయడం కష్టమే. జనాభా ఎక్కువ. ఊహించని విధంగా జనాభా రోడ్ల మీదకు అవసరం ఉన్నా లేకపోయినా వస్తు ఉంటారు. ఎవరు ఏ పనులు మానుకునే పరిస్థితి దాదాపుగా ఉండదు అనే చెప్పాలి. దానికి తోడు మత పరమైన వ్యవహారాల పేరుతో ఏదోక కార్యక్రమం ఉంటుంది. ప్రాణం మీదకు వచ్చినా సరే జనం మాత్రం వాటికి దూరంగా ఉండే అవకాశం ఉండదు. 

 

ఏమైనా అంటే మా మతాలను అవమానిస్తున్నారు అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ ని ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా అది కట్టడి అయ్యే పరిస్థితి ఉండదు ప్రజల సహకారం లేకపోతే అంటున్నారు. ఇక వాతావరణం ఏ విధంగా ఉన్నా సరే వైరస్ విస్తరిస్తుంది కాబట్టి కఠిన చర్యలు అమలు చేసినా జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి లాభం లేదని కొందరు అంటున్నారు. ప్రజలకు ప్రతీ చిన్న విషయం ప్రాణం మీదకు వచ్చినట్టే ఉంటుంది. కాబట్టి కరోనా వైరస్ నియంత్రణ అనేది జనం మాట వినకపోతే కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: