ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు చిగురుటాకు మాదిరి వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఊహించిన దాని కంటే అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరించడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా సరే ఇది మాత్రం అదుపు అయ్యే పరిస్థితి పెద్దగా కనపడటం లేదు. ఇది పక్కన పెడితే ఈ వైరస్ ని ప్రపంచం మొత్తం తక్కువ అంచనా వేసింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి ఇప్పుడు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది అనే అంచనాకు ప్రభుత్వాలు రాలేదు. 

 

వ్యూహాన్ లో వైరస్ తీవ్రంగా ఉన్నా సరే ప్రభుత్వాలు మాత్రం తమ వద్దకు రాదు లే అనుకున్నాయి. ఇటలీ లాంటి దేశాలు కూడా దీన్ని అంచనా వేయలేక కఠిన చర్యలు తీసుకోలేదు. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను కొనసాగించడం తో దేశం మొత్తం వైరస్ వేగంగా విస్తరించింది. తమ వరకు రాదనే భావించారు. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కరోనా వైరస్ తీవ్రతకు స్వర్గమే వాతావరణం ఆ విధంగా ఉంటే. ఇక మన దేశంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ విస్తరించే అవకాశం లేదని అనుకున్నారు అందరూ. 

 

కాని అది అత్యంత వేగంగా ఏ వాతావరణం ఉన్నా సరే విస్తరించింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అదే నమ్మకం తో ఉన్నా సరే వేగంగా వైరస్ విస్తరించింది. 14 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చింది. ఇప్పుడు దేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. మీడియాలో జరుగుతున్న హడావుడి కూడా జనాలను కాస్త ఎక్కువగానే భయపెడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే కొన్ని దేశాలు మాత్రం తక్కువ అంచనా వేసి చర్యలు తీసుకోలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: