నిర్భయ దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేసారు అధికారులు. ఉదయం 5;30 నిమిషాలకు వారికి తీహార్ జైల్లో ఉరిశిక్ష ను అమలు చేసారు. నలుగురు దోషులకు ఒకేసారి తీహార్ లోని మూడో నెంబర్ జైల్లో శిక్ష విధించారు. ఇలా నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం ఇదే చరిత్రలో తొలిసారి. 2012 లో జరిగిన నిర్భయ అత్యాచారం కేసులో ఇప్పటికి నిందితులకు శిక్ష విధించారు. అప్పుడే కోర్ట్ ఉరి శిక్ష విధించడం, ఆ తర్వాత అనేక అప్పీళ్ళు, మధ్యలో ఒక దోషి మరణించడం ఇవన్ని జరిగాయి. 

 

అనేక పిటీషన్ లు దాఖలు చేసారు. తమకు ఉన్న అన్ని న్యాయ రాజ్యాంగ అవకాశాలను నలుగురు నిందితులు వాడుకున్నారు. అంతర్జాతీయ న్యాయ స్థానం వరకు వెళ్ళినా సరే ఉరిశిక్ష అమలు ఆగలేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు నలుగురు దోషుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు గాను ఎవరూ కుటుంబ సభ్యులు రాలేదు. వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్ ల మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకి రాకపోవడంతో జైలు అధికారులే ఖననం చేసే అవకాశాలు ఉన్నాయి. 

 

ప్రస్తుతం వారి మృతదేహాలకు శవ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇది పూర్తి అయిన తర్వాత ఎవరైనా వస్తే వారి మృతదేహాలు అప్పగిస్తారు. లేకపోతే మాత్రం అధికారులే వారి వారి మతాల ఆధారంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. నలుగురు హిందువులు కాబట్టి హైందవ సాంప్రదాయం ప్రకారం వారిని ఖననం చేయనున్నారు అధికారులు. వారిని ఉరి తీయడం తో దేశం మొత్తం హర్షం వ్యక్తమవుతుంది. నిర్భయ తల్లి ఆశా దేవి, మీడియా తో మాట్లాడుతూ తన కూతురుకి ఇన్నాళ్ళకు న్యాయం జరిగిందని అన్నారు. ఇక సామాజిక కార్యకర్తలు అందరూ కూడా... తీహార్ జైలు వద్దకు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: