దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ అనే 23 ఏళ్ల యువతిపై సామూహిక గా ఆరుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమె మర్మాంగాలలోకి పదునైన వస్తువులు జొప్పించడంతో తీవ్ర గాయాలపాలైన నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఇలా ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ఏకంగా నిర్భయ పేరుతో ఒక సారి కొత్త చట్టాన్ని కూడా తీసుకు వచ్చారు. అయితే సరి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ నిర్భయ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్భయ దోషులకు ఉరి పడలేదు. ఒకవేళ కోర్టులు  ఉరిశిక్ష విధించినప్పటికీ.. భారత చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుంటూ నిర్భయ దోషులకు ఉరి వాయిదా పడేలా చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. 

 

 

 గత కొన్ని నెలలుగా నిర్భయ దోషులకు కొంచెంకొంచెంగా ఉచ్చు  బిగుస్తూ వచ్చింది. చట్టపరంగా వారికి ఉన్న అవకాశాలు  కూడా అయిపోయాయి . ఇక నిర్భయ కేసులో నిర్భయ తల్లి ఎంతగానో న్యాయపోరాటం చేసింది . తమ కూతురికి ఆ గతి పట్టించిన అందరు నిందితులకు కఠిన శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగింది. ఇక నిర్భయ దోషులకు ఉరి వాయిదాపడుతూ రాగా ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఈరోజు ఉదయం అయిదున్నర గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీయాలి అంటూ పటియాల హౌస్ కోర్టు తీర్పును వెలువరించింది. నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ముఖేష్, పవన్ వినయ్, అక్షయ్ లను తీహార్ జైలులో తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఉరితీశారు. 

 

 

 అయితే మామూలుగా ఏ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించిన  ముందు చివరి కోరిక ఏమైనా ఉంటే తీర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే నిర్భయ దోషులకు ఉరి ముందు చివరి కోరిక తీర్చుకునేందుకు అవకాశం కల్పించారు తీహార్ జైలు అధికారులు. ఈ నేపథ్యంలోనే నిర్భయ దోషుల్లో  ఒక్కరైనా వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి... పూరి సబ్జి  కచోరి తినిపించాలని ఉందని అధికారులను కోరినట్లు సమాచారం. అలాగే మిగతా దోషులు సైతం తమ చివరి కోరికలు జైలు అధికారులకు తెలపగా.. వారికి గత రాత్రి మంచి భోజనం అధికారులు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు కావడంతో దేశం మొత్తం హర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: