ఓ ఆడబిడ్డ ఆత్మ శాంతించింది.. ఓ తల్లి ఆవేదనకు ఇక అంతం లేదా.. ? అన్న ప్రశ్నలకు జవాబు దొరికింది.. ఇప్పుుడు ఆమె సంతోషంలో ఉంది.  సాధారణంగా ఏ మనిషి ప్రాణాలు పోతున్నా అయ్యో పాపం అనిపిస్తుంది.. కానీ ఆ తల్లి ఆ నలుగురు ప్రాణాలు ఎప్పుడు పోతాయా తన బిడ్డ ఆత్మశాంతి ఎప్పుడు కలుగుతుందని కంట్లో వొత్తులు వేసుకొని చూసింది.  ఢిల్లీలో ఓ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వెళ్లుండగా బస్సులు కామాంధులు ఆమె స్నేహితుడిని కొట్టి బయటకు నెట్టి.. ఆపై దారుణమైన హింసతో అత్యాచారం చేశారు.  ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని కృరంగా హింసించి అత్యాచారం చేశారు. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. 

 

ఇక దేశం దద్దరిల్లేలా ఆ యువతికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తారు.. చిన్నా, పెద్ద, ఆడా మగా అనే తేడా లేకుండా ఆ నింధితులను వెంటనే కాల్చి వేయాలని.. ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో వారికి ఉరిశిక్ష విధించారు.  ఇక అప్పటి నుంచి ఈ కథ సాగుతూనే ఉంది. ఆ నింధితులు చట్టంలోని లొసుగులన్నీ ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చారు.  గత నెల ఇక ఉరి ఖరారు అన్న సమయంలోనూ కొత్త ట్విస్ట్ పెట్టి తప్పించుకున్నారు. కానీ ఈ రోజు ఉరినుంచి తప్పించుకుపోలేకపోయారు.  నిర్భయదోషుల కథ ముగిసి పోయింది.  కానీ దేశంలో కామాంధులు ఇలాగే రెచ్చిపోతున్నారు.

 

నేరం జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ తెల్లవారుజామున తీహార్ జైలులో కట్టుదిట్టమైన చర్యల మధ్య దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.  ప్రొటోకాల్ ప్రకారం.. దోషుల మృతదేహాలను అరగంటపాటు ఉరికొయ్యలకు అలాగే వేలాడదీశారు. ఆ తర్వాత వాటిని కిందికి దించారు. కాగా, ఒకే నేరానికి సంబంధించి ఒకేసారి నలుగురికీ మరణదండన అమలు చేయడం తీహార్ జైలులో ఇదే తొలిసారి. ఉరితీత అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: