చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి వేలాది మందిని బలి తీసుకోగా.. ల‌క్ష మందికి పైగా చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతానికి ఈ వైరస్‌కి వ్యాక్సిన్ లేదు. దీంతో ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా వ్యాప్తి చెందుతుంది. ఇప్ప‌టికే కరోనా వైరస్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో మ‌రో క‌రోనా  పాజిటివ్‌ కేసు నమోదైంది.

 

విశాఖపట్నంలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవల మక్కా వెళ్లి వచ్చిన ఒకరికి కరోన వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక రెండు కేసు ఒంగోలుకు చెందిన  యువకుడు ఐదు రోజుల క్రితం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు.. అక్కడ స్నేహితుడి ఇంట్లో నాలుగు రోజులు ఉన్నాడు.

 

ఈ నెల 15న  ఒంగోలుకు చేరుకున్నాడు. 16న కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక నిన్న తిరుమల లో ఓ వ్యక్తికి కరోనా అనుమానంతో పరీక్షలు నిరహించారు. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. నిన్నటి నుంచి వారం రోజుల పాటు తిరుమల లో దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో 14 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ఇందులో ఐదుగురు విమాన మార్గంలో తెలంగాణ రాగా, మిగతా 9 మంది రోడ్డు మార్గంలో రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో ఇండోనేసియా వాసులు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు క‌ఠ‌న చ‌ర్చ‌లు చేప‌ట్టింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: