ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు వేగవంతగా స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చని సింగపూర్ నిరూపించింది.. ఇక ఒకప్పుడు భారీ ఆర్థిక మాంద్యంలో కూరుకు పోయిన సింగపూర్.. ‘సున్నా’ నుంచి సంపన్న దేశంగా ఎదిగి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుంది.. ఇంతటి రక్షణ వ్యవస్ద ఉన్న ఈ దేశాన్ని కూడా కరోనా వైరస్ తన హస్తాలతో బంధించింది... ఎందుకంటే.. ఈ దేశానికి ఎక్కువగా వచ్చే పర్యాటకుల్లో చైనా వారు ఉంటారు.. దీని ఫలితంగా చైనా తర్వాత కరోనా వైరస్ కేసులు నమోదైన రెండో దేశం సింగపూర్ కావడం గమనార్హం..

 

 

ఇకపోతే చైనాలోని గువాంగ్జీ నగరం నుంచి 20 మంది పర్యాటకుల బృందం జనవరి నెల మధ్యలో  సింగపూర్ పర్యటించిందట.. అలా ఆ బృందం తమకున్న వైరస్‌ను మెడికల్ షాప్‌ లో ఉన్న మహిళకు అంటించారట.. ఇలా ఆ మహిళ ద్వారా ఆమె కుటుంబానికి, ఆ షాపుకు వచ్చే కస్టమర్లకు చాపకింద నీరులా కరోనా అక్కడ విస్తరించడం మొదలు పెట్టిందట.. ఇదే సమయంలో తమ దేశంలో ‘కరోనా’ అనే కొత్తరకం వైరస్ ఏర్పడిందని, చైనా ప్రకటించడంతో వెంటనే సింగపూర్ అప్రమత్తమైంది..  జనవరి నెలలో ఆ దేశానికి వచ్చిన చైనా పర్యాటకుల జాబితాను సేకరించింది. వాళ్లు పర్యటించిన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపి వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని నిర్బంధంలోకి తీసుకుని నేరుగా హాస్పిటల్‌కు తరలించింది.

 

 

మెడికల్ షాపులో వైరస్ పుట్టిందని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి, ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అనుమానితులకు హాస్పిటల్‌లో చికిత్స అందించడం మొదలు పెట్టింది. అయితే, అప్పటికి 18 మంది లో మాత్రమే కరోనా వైరస్ ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 243కు పెరిగింది. కానీ ఒక్క మరణం కూడ నమోదు కాలేదు.. అలాగే కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక సింగపూర్ ప్రభుత్వం వైరస్ గురించి తెలియగానే, ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని.. టీవీలు, మొబైళ్లు, రేడియోల ద్వారా సమాచారం అందించింది. ఇలా చేయలేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

 

 

అంతే ప్రజలంతా స్పందించి స్వచ్ఛందంగా హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు రోడ్డు, రైలు, నౌకా, విమాన మార్గాల్లో కూడా వైద్య సిబ్బందిని మోహరించింది. థర్మల్ టెస్టుల ద్వారా ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలపై నిఘా పెట్టింది. అనుమానితులను నిర్బంధించి మరీ హాస్పిటళ్లకు తరలించింది. రోడ్డు మీద వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి మరీ తనిఖీలు నిర్వహించింది. ఇక మాస్కులను ఇంటింటికీ ఉచితంగా పంపింది. ఫలితంగా మాస్కులకు భారీగా కొరత ఏర్పడగా, వేల సంఖ్యలో మాస్కులను తయారు చేసే బాధ్యతలను సైన్యానికి అప్పగించింది. అలాగే,  మెడికల్ దుకాణాలకు అధిక ధరలకు మాస్కులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ప్రజలకు అందుబాటు ధరల్లోనే మాస్కులు లభించాయి..

 

 

ఇలా తక్షణం వైద్యసేవలు ఇంటి వద్దకే అందిస్తూ స్వార్ధం లేకుండా అక్కడి ప్రభుత్వం పనిచేసింది.. తనకున్న పరిజ్ఞానం తో వైరస్ వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆ దేశం మౌలిక సదుపాయాలను సమకూర్చుకోగలిగింది. మరి, మన దేశ పరిస్దితి అందుకు భిన్నంగా ఉంది.. కరోనా వస్తుందని చెప్పితే నాకేం కాదని నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారు ఎక్కువగా ఉన్నారు.. అందులో మనకున్న మౌళిక సదుపాయాలు అంతంత మాత్రమే.. ఇలాంటి పరిస్దితుల్లో కరోనా విషయంలో ఏమాత్రం తేడావచ్చిన ఇక మీరే ఊహించుకోండి ఏం జరుగుతుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: