ఎన్నో ఏళ్ల పాటు వాయిదా పడుతూ వస్తున్న నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమల అయ్యింది. అయితే కొన్నేళ్ళ క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ అనే 23 ఏళ్ల యువతిపై ఆరుగురు నిందితులు అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి... అనంతరం ఆమె మర్మాంగాలలోకి పదునైన వస్తువులు జొప్పించడంతో నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు  గురిచేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని శిక్షించేందుకు ఏకంగా నిర్భయ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే మొదట జైలు శిక్ష అనుభవిస్తున్న నిర్భయ నిందితులకు ఒక నిందితుడు జైల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

 

ఇక మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు. ఇక ప్రస్తుతం ఉన్న నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఉరి శిక్ష విధించి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్భయ దోషులకు మాత్రం ఇప్పటివరకు ఉరిశిక్ష పడలేదు. భారత చట్టాలలో ఉన్న అవకాశాలను అన్నింటిని  ఉపయోగించుకుంటూ కోర్టులు  ఉరిశిక్ష విధించినప్పటికీ అవి వాయిదా పడేలా చేస్తూ ఇప్పటివరకు కాలయాపన చేశారు నిర్భయ కేసులో నలుగురు నిందితులు. ఇక చట్టపరంగా నిర్భయ దోషులకు ఉన్న అన్ని అవకాశాలను అయిపోయాయి. 

 

 

 దీంతో నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. ఇక తీహార్ జైలులో తెల్లవారుజామున నిందితుడు ముఖేష్, పవన్ గుప్తా,  వినయ్ శర్మ, అక్షయ్ లకు  ఉరిశిక్ష అమలు చేశారు.ఈ సందర్భంగా నెటిజన్లు అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్భయకు అసలైన నివాళి దక్కింది అంటూ ఈ సందర్భంగా నెటిజన్లు  అంటున్నారు. ఏడు సంవత్సరాల నుండి ఇన్నాళ్ళకి నిర్భయకు అసలైన న్యాయం జరిగింది అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు కానీ సరైన శిక్ష అమలు అయింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: