డబ్బులు... డబ్బులు... మనిషి మనుగడకి దీని అవసరం ఇప్పుడు అవసరం ఉంది. డబ్బులు సంపాదించడం కోసం రేయింబవళ్లు కష్టపడి సంపాందించేవారు కొందరైతే మరి కొందరు ఎవరినైనా మోసం చేసి డబ్బులు సందించివారు కొందరు. ఈ మధ్య ఇవి చాల ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో సైబర్ నేరాలు తెలుసు కోవలిసినవి. ఇదే కోవాలి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒకటి బయటపడింది. 

 

 


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జోగాడ వంశీకృష్ణ (30) అలియాస్‌ హర్ష సోషల్ మీడియా ద్వారా వైద్య విద్యార్థినులను పరిచయం చేసుకొని రూ.కోట్లు దండుకుంటున్న ఈ నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు 2015 సంవత్సరం నుంచి ఈ నేరాలకు పాల్పడుతూ దాదాపు ఆరేళ్లలో రూ.6 కోట్లు వరకు వైద్య విద్యార్థినుల నుంచి డబ్బులు గుంజసాగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వంశీ కాకినాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువు మధ్యలో వదిలేశాడు. ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గంలో అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టాడు. 

 

 

 అందులో భాగంగానే మెడిసిన్ చదివే విద్యార్థినుల వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుందని భావించి, వారికి సంబంధించిన సోషల్ మీడియాలో వారిని ఫేలౌ అయ్యి వారితో స్నేహం పెంచుకోవడం   మొదలు పెట్టాడు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఫేస్‌ బుక్‌ ఖాతాలున్న వైద్య విద్యార్థినులను వెతికి మరీ వారితో ఈ ప్రబుద్దుడు స్నేహం చేసేవాడు. ల కొద్దీ రోజులు గడిచాక తనకు డబ్బులు అవసరమంటూ నగదు ఇప్పించుకొనేవాడు. ఇలా మొదటిసారి 2015 సంవత్సరంలో హైదరాబాద్‌ కు వచ్చిన వంశీకృష్ణ 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఇలా మొత్తం వైద్య విద్యార్థుల నుంచి 4 సంవత్సరాలలో రూ.4 కోట్లు మోసం చేసి వారితో ఇప్పించుకున్నాడు.

 

 

వారితో నమ్మకం కలిగాక భారీగా డబ్బులు లాగి, ఆ తర్వాత ఆ ఫోన్‌ స్విచ్ ఆఫ్  చేయడం వల్ల అతని ఆచూకీ తెలుసుకోవడం కష్టతరమైంది  పోలీసులకి. ఇలా చేస్తున్న వంశి 6 సంవత్సరాల నుంచి మోసాలు చేస్తున్న ఇతనిపై హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్య విద్యార్థిని, ఆమె బంధువుల నుంచి ఇటీవల సుమారు రూ.60 లక్షలు వసూలు చేసి వారికీ టోకరా వేసాడు. దీనితో వారు పోలీసులకి విషయం తెలపడంతో, అనంతరం పోలీసుల విచారణలో వంశీ ఆర్థిక లీలలన్నీ ఒక్కొకటి వెలుగులోకి వచ్చాయి. ఇలా మోసం చేసి తీసుకున్న రూ.లక్షలను వంశీకృష్ణ క్రికెట్‌ బెట్టింగ్‌ లు, గుర్రపు పందాలు ఆడుతూ విలాసవంతమైన జీవితానికి వెచ్చించేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: