వైసిపి నేత లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబునాయుడు వల్లే ప్రాణహానీ ఉందని ఆరోపించారు.  స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా తర్వాత నుండి నిమ్మగడ్డ- ప్రభుత్వానికి మధ్య పెద్ద వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి వెంటనే సుప్రింకోర్టులో కేసు వేశాడు. కేసు విచారణ తర్వాత నిమ్మగడ్డకు తలంటి పోస్తునే ఎన్నికల వాయిదా నిర్ణయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.

 

నిజానికి సుప్రింకోర్టు తీర్పులో నిమ్మగడ్డ నిర్ణయాన్నే తప్పు పట్టింది. ఎప్పుడైతే సుప్రిం తీర్పులో నిమ్మగడ్డను తప్పుపట్టిందో కొద్దిసేపటికి నిమ్మగడ్డ పేరుతో ఓ లేఖ వెలుగు చూసింది. దాంతో ఆ లేఖ మరో సంచలనంగా మారింది. ఇదే విషయమై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చూడబోతే నిమ్మగడ్డ నుండి లెటర్ ప్యాడ్ ను టిడిపి నేతలు తీసేసుకున్నట్లు అనుమానంగా ఉందన్నారు. అలాగే జీ మెయిల్ ఐడితో పాటు పాస్ వర్డ్ కూడా తీసుసుకున్నారేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు.

 

నిమ్మగడ్డకు తెలిసే టిడిపి నేతలు లేఖ డ్రాఫ్ట్ చేసుంటారని ఆమె అన్నారు. కాకపోతే మెయిల్ నుండి పంపటం, లేఖలో సంతకాలు కమీషనర్ వే ఎవరో పోర్జరీ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశంపార్టీ చేసిన ప్రతి వ్యవహారం చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఆమె నమ్మకంగా చెప్పారు. నిమ్మగడ్డ తనకు ప్రాణహాని ఉందని భయపడటంలో తప్పేమీ లేదని కాకపోతే ఆ హానేదో చంద్రబాబు నుండే ఉంటుందని ఆమె గట్టిగా చెప్పారు.

 

తాను స్వతంత్రంగా వ్యవహరించలేక అలాగని చంద్రబాబో లేకపోతే తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న చేష్టలను భరించలేక నిమ్మగడ్డ అవస్తలు పడుతున్నారని ఆమె అంచనా వేశారు. కమీషనర్ ను అడ్డం పెట్టుకుని తాను ఆడిన నాటకాలు బయటపడతాయని అనుమానం వస్తే నిమ్మగడ్డకు చంద్రబాబు నుండే ప్రాణాపాయం ఉందని లక్ష్మీపార్వతి స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి తనకు ప్రాణహాని ఎవరి నుండి ఉందో నిమ్మగడ్డకు క్లారిటి ఉంటే బాగుంటుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: