ఒక వైపు కరోనా కుమ్మేస్తుంటే.. ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటే.. కనీసం మనుషులుగా అయినా మన బాధ్యత సక్రమంగా నిర్వహించకుంటే ఇక ఎవరు రక్షిస్తారు.. ప్రతి పౌరునికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది.. అది తన కర్తవ్యంగా పాటిస్తే.. కరోనా ఏంటి దాని అమ్మ వచ్చిన దైర్యంగా ఎదుర్కొనవచ్చూ.. అంతేకాని ఎవరో వచ్చి ప్రజలను ఇలాంటి అపాయాల నుండి రక్షిస్తారనే భ్రమను వదులుకోవాలి.. ఇక ప్రపంచం మొత్తం ఇప్పుడున్న విపత్తునుండి ఎలా భయటపడాలని ఆలోచిస్తుంటే, కొందరు మాత్రం ఈ రోగాన్ని ఎలా అంటించుకోవాలని ఎదురుచూస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు..

 

 

అరే ఇంత నిర్లక్ష్యం ఎందుకండి.. ఇంతలా చెబుతున్న ఏం జరిగిందో మాత్రం చెప్పడం లేదనుకుంటున్నారా.. వినండి.. కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే.. ఒక ఫ్యామిలీ మాత్రం ఇంట్లో ఇడ్లి చేసుకోవడానికి బద్దకం వేసిందో ఏమో ఓ సైకిల్ బండి దగ్గర ఉదయాన్నే ఇడ్లీ తిని వాంతులు చేసుకుని వెంటనే హస్పిటల్‌కు పరిగెత్తారు.. అసలు ఏం జరిగిందోనని ఆరా తీస్తే.. వారు తిన్న చట్నీలో చనిపోయిన బల్లి కనిపించిందట. ఇక ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్‌లో జరిగిందట..

 

 

ఈ మధ్య కాలంలో ఉదయాన్నే సైకిళ్లపై అల్పాహారాలు విక్రయించే వారి సంఖ్య ఎక్కువైంది. అలాగే ఇంట్లో వంట చేసుకుని తినే వారికి ఓపిక తక్కువైంది.. ఫలితంగా వ్యాపారులకు నిర్లక్ష్యం కూడ మించిపోయింది.. ఈ క్రమంలో ఒకతని దగ్గర ఇడ్లీలు తిన్న ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యారు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన వారు చట్నీలో చూసేసరికి చనిపోయిన బల్లి కనిపించింది.

 

 

ఇదే కాకుండా అప్పటికే ఆ వ్యక్తి దగ్గర అల్పాహారం కొన్న మరో పది మంది స్థానికులు కూడా ఆసుపత్రిలో పరీక్షలు చేయించు కున్నారు. అయితే ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్లు చెప్పడం తో ఊపిరి పీల్చుకున్నారు. చూసారా.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అనారోగ్యాలు రాకుంటే, ఆరోగ్యాలు వస్తాయా.. అందుకే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి.. ఇప్పుడున్న కరోనా అనే ప్రమాదం నుండి భయటపడాలనే ఆలోచనతో మెదలాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: