దిశ అత్యాచారం, హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ కేసు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన మూడున్నర నెలల్లోనే నిర్భయ దోషులకు ఉరి అమలు కావడంతో దిశ నిందితుల ఎన్ కౌంటర్ వల్లే ఈ కేసులో శిక్ష వేగంగా అమలయిందని తెలుస్తోంది. దిశ, నిర్భయ కేసుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. 
 
అత్యాచారానికి గురైన ఇద్దరు యువతుల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దిశ కేసులో పోలీసులు దోషులను ఎన్ కౌంటర్ చేయడం వల్ల నిర్భయకు సత్వర న్యాయం జరగగా నిర్భయకు న్యాయం జరగడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది. నిర్భయ అత్యాచారానికి గురైన తర్వాత 13 రోజుల చికిత్స అనంతరం మృతి చెందింది. 
 
దిశను కామాంధులు పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చారు. 2019 డిసెంబర్ 6న సైబరాబాద్ పోలీసులు దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ జరిగిన 105 రోజుల తరువాత నిర్భయ దోషులకు ఉరి అమలైంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ప్రభావం పడటంతో నిర్భయ కేసు వేగవంతమైంది. నిర్భయ దోషులకు గతంలోనే ఉరి అమలు చేయాల్సి ఉన్నా పలు పిటిషన్లు దాఖలు చేస్తూ దోషులు ఉరి అమలును వాయిదా వేస్తూ వచ్చారు. 
 
ఏడేళ్ల తర్వాత నిర్భయ కేసులో న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. ఉరి అమలుతో నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని అన్నారు. తొలిసారి నిర్భయ దోషులకు పాటియాలా హైకోర్టు 2013 సెప్టెంబర్ లో ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత దోషులు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఉరి అమలు ఆలస్యమవుతూ వచ్చింది. నిర్భయ దోషుల ఉరితీతను వైద్యులు ధ్రువీకరించారు. నలుగురు దోషులు మృతి చెందినట్లు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: