గత కొన్ని రోజుల క్రితం వరకు చైనాలోని వూహన్ నగరం మరణాలకు నిలయంగా మారింది. కాని ఇప్పుడు అందమైన దేశంగా పేరుగాంచిన ఇటలీ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణుకుతోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూ ఇక్కడ మరణ మృందంగం మోగుతుంది.. ఇకపోతే అత్యధికంగా కరోనా మరణాలు చైనాలోనే చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఈ సంఖ్యను ఇటలీ దాటేసింది. ఈ కంత్రి కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 500 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇటలీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

 

ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 3,250 మంది ప్రాణాలు కోల్పోగా, ఇటలీలో కరోనా మృతుల సంఖ్య గురువారం వరకు 3,405కు చేరి చైనాను దాటవేసింది.. కొత్తగా మరో 5,322 మందికి వైరస్ నిర్ధారణ కాగా, బాధితుల సంఖ్య 41వేలు దాటింది. ఇంతటి దారుణాలు జరగడానికి కారణం ఇటలీ ప్రభుత్వం కరోనా విషయంలో మొదటగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు పరిస్దితులు చేయి దాటాయనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఏది ఏమైనా ఇటలీలో ఉన్న అందమైన ప్రదేశాలన్ని ఇప్పుడు శవాలతో నిండిపోతున్నాయి..

 

 

ఈ ప్రాంతంలో పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడ వల్లే వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రస్తుతం ఇటలీకి సహకరిస్తున్న చైనా వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తుండగా, అత్యధికంగా కోవిడ్ మరణాలు ఉత్తర ఇటలీలోని లంబార్డే ప్రాంతంలోనే చోటు చేసుకుంటున్నాయి... ఇకపోతే రెండు నెలల కిందట వుహాన్‌ నగరంలో పరిస్దితులు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం లంబార్డేలోని పరిస్థితులు అలాగే ఉన్నాయని, ఇలాంటి సమయంలో వుహాన్ నగరం మొత్తం లాక్ డౌన్ చేశాయగా, కోవిడ్ కేసులు క్రమంగా అదుపులో వచ్చాయని కానీ ఇటలీలో మాత్రం అలాంటి చర్యలు తీసుకోలేదని  ప్రజా రవాణా నిలిచిపోలేదని, ప్రజలు కూడా రోడ్లపై తిరుగుతున్నారని, రెడ్ క్రాస్ చైనా ఉపాధ్యక్షుడు సన్ ష్యుపెంగ్ మీడియాతో తెలిపారు..

 

 

ఇక ఇటలీ ప్రపంచానికి మరచిపోలేని గుణపాఠాన్ని నేర్పిందని అనుకోవచ్చు.. ఈ కరోనా ఒక్కటే కాదు ఇకముందు ఏదైనా విపత్తు తలెత్తితే.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల.. ఆ ప్రమాదాల బారినుండి కొంత వరకైనా నష్టాన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రజల్లారా, మీరు మీ స్నేహితులు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రస్తుత పరిస్దితుల్లో అతి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మరవకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: