నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఉరిశిక్షను వాయిదా పడేలా చేస్తూ వస్తున్న నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కారు. గత ఏడు సంవత్సరాల క్రితం 23 ఏళ్ల యువతిపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిర్భయ నిందితులకు ఉరి శిక్ష పడడం తో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇన్ని రోజుల వరకు చట్టంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ... చట్టాలను కోర్టులు  ఇచ్చిన తీర్పులను అవహేళన చేస్తూ వచ్చారు నిర్భయ కేసులో నిందితులు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలందరూ నిర్భయ దోషుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎట్టకేలకు నలుగురు నిందితులకు ఉన్న అన్ని అవకాశాలను పూర్తవడంతో ఉరికంభం ఎక్కక  తప్పలేదు. 

 

 

 ఇన్ని సంవత్సరాలకి నిర్భయ దోషులకు శిక్ష పడేలా న్యాయ పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం లభించింది. ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు నలుగురు నిందితులను దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్మాగారమైనా  తీహార్ జైలులో ఉరి శిక్ష విధించారు. అయితే నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి తీసేముందు... సదరు నిందితులు దేవున్ని కూడా  తలచుకో లేదు. అయితే నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఉరి తీయడానికి ముందు చివరిగా ఒక్కసారి మతపరమైన పూజలు చేసేందుకు అధికారులు నిందితులకు అవకాశం కల్పించారు. కానీ ఉరికంబం ఎక్కే  ముందు పూజలు నిర్వహించడానికి నిర్భయ దోషులకు నిరాకరించారు. 

 

 

 నిర్భయ కేసులో నలుగురు నిందితులు అయిన ముఖేష్,  వినయ్, పవన్ అక్షయ్ లను ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్ర లేపిన జైలు అధికారులు... రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్నానం చేసిన అనంతరం... నలుగురు నిందితులకు తమ మతపరమైన పూజలు చేసుకునేందుకు దేవుని ప్రార్థించేందుకు  అవకాశం కల్పించారు జైలు అధికారులు. కానీ నిర్భయ కేసులో నిందితులు మాత్రం తమకు ఇష్టమైన దేవుడిని తలుచుకోమంటూ జైలు అధికారులు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించారు. ఉరి తీసేముందు తాము ఎలాంటి పూజలు చేయమంటూ తెలిపారు. ఇక అనంతరం వారికి అల్పాహారం అందించి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం.. న్యాయమూర్తి వైద్యులు జైలు అధికారుల సమక్షంలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను అమలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: