వాళ్లిద్దరూ ప్రేమికులు.. పెళ్లి కి ముందే తొందరపడ్డారు.. ఇంతలో గర్భం వచ్చింది. చూస్తూనే నెలలు నిండాయి. అప్పటి వరకూ ఏదో ఒకటి చెపుతూ కవర్ చేస్తూ వచ్చిన ప్రేమికుల జంట మరో సాహసం చేసింది. గర్భం విషయం ఎవరికీ తెలియకూడదని.. తానే కాన్పు చేయాలనుకున్నాడు సదరు ప్రియుడు.. అందుకు యూట్యూబ్ నే గురువు గా చేసుకున్నాడు.

 

 

కాన్పుకు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకుని ప్రియురాలిని అడవిలోకి తీసుకెళ్లి కాన్పు చేయబోయాడు.. అనుభవం లేక.. చివరకు గర్భంలో శిశువు మృతి చెందాడు. అమ్మాయి మాత్రం ప్రాణాలతో మిగిలింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన సౌందర్‌ ఓ ప్రైవేటు వంట గ్యాస్‌ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు.

 

 

దగ్గరలోని ఓ కాలేజ్ విద్యార్థినిని ప్రేమ మాటలతో మాయలో పెట్టాడు. ఆమెతో తెగ ఎంజాయ్ చేశాడు. ఆమె గర్భం దాల్చింది. ఎనిమిదో నెల వచ్చే వరకూ ఆ యువతి ఏదో ఒకటి చెబుతూ మేనేజ్ చేసింది. ప్రసవ నొప్పులు రావడంతో ప్రియుడు సౌందర్‌కు ఫోనులో విషయం చెప్పింది. దాంతో అతడే ప్రసవం చేయాలని డిసైడ్ అయ్యాడు. అతడు గ్లౌజులు, కత్తెర, బ్లేడు తదితర సామగ్రిని కొనుక్కుని బండిపై ఆ యువతిని తీసుకుని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.

 

 

ఓ చెట్టు కింద యువతిని పడుకోబెట్టి యూట్యూబ్‌ వీడియో చూస్తూ ప్రసవం చేశాడు. బ్లేడుతో కోయడంతో గర్భసంచిలోని శిశువు చేయి తెగిపోయింది. యువతి పేగు కూడా తెగి తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో భయపడి ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేసి శిశువు మృతదేహాన్ని బయటకు తీశారు. యువతి ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. పోలీసులు సౌందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: