ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 195కు చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భారీన పడి ఇప్పటివరకు నలుగురు మరణించగా, ఇంటెన్సివ్ కేర్ లో ఇద్దరు బాధితులు చికిత్స పొందుతున్నారు. 
 
మొన్నటివరకు ఏపీలో ఒక కరోనా పాజిటివ్ కేసు ఉండగా, నిన్న ఒక్కరోజే రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది. ప్రభుత్వం స్కూళ్లు, థియేటర్లు, జిమ్, పార్కులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నాయి. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారికి ఈ నెల 31 వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి చెప్పారు. 
 
దేశంలో కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఏపీలో విశాఖలో ఉన్న 65 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ హైదరాబాద్ మెట్రో రైలుపై పడింది. కరోనా దెబ్బకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావడంతో మెట్రోపై ప్రభావం పడింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ట్రిప్పుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే కరోనా భారీన పడకుండా బయట పడవచ్చు. ఇప్పటివరకూ చైనా, ఇరాన్ లో కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: