నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరుతో మీడియాలో రచ్చ రచ్చ అయిన వార్త ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అయితే లేఖ తాను రాశానని మాత్రం నిమ్మగడ్డ క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇలా డ్రామాలు ఆడడం ధర్మమేనా..? నా ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఈసీ రమేష్‌కుమార్‌ పేరుతో లెటర్‌ చక్కర్లు కొడుతుంటే దానిపై స్పందించాల్సిన బాధ్యత ఆయనకు లేదా..?

 

 

ఇదే ప్రశ్న అడుగుతూ నిలదీస్తోంది వైసీపీ. ఈ లెటర్‌పై నిజానిజాలు తేల్చాలని డీజీపీని కోరింది కూడా. మరి నిమ్మగడ్డ మౌనం చంద్రబాబు కుట్రలో భాగమేనా..? ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా చంద్రబాబు, రమేష్‌కుమార్‌ కుట్ర పన్నుతున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన తరువాత ఈ అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి.

 

 

స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు ఐదు పేజీల లేఖ రాశారని, అది వారికి చేరిందని మీడియాలో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఆ తరువాత అదే మీడియా ఫేక్‌ లెటర్‌ అని మళ్లీ ప్రచారం చేసింది. తరువాత పత్రికా విలేకర్లు కొంతమంది రమేష్‌కుమార్‌ ఆఫీస్‌ నుంచి బయటకు వస్తున్న తరుణంలో లేఖ గురించి అడిగితే.. తాను రాయలేదని చెప్పారు. మరి తాను రాయని లేఖ ఇంత ఎక్కువగా ప్రచారం అవుతుంటే.. మీడియా ముందుకొచ్చి స్పందించాల్సిన అవసరం లేదా..?

 

 

కనీసం ఓ ప్రెస్ నోట్ ద్వారా అయినా స్పందించాల్సిన అవసరం రమేశ్ కుమార్ కు లేదా..? అన్నీ తెలిసీ ఆయన మౌనంగా ఉన్నారంటే.. ఈ కుట్రలో ఆయన కూడా పాలు పంచుకుంటున్నట్టేగా... ఇప్పుడు ఇదే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. మరి రమేశ్ కుమార్ ఎప్పుడు స్పందిస్తారో ఏమో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: