పచ్చమీడియా వండి వారుస్తున్న కథనాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తాము రాస్తున్న కథనాలను జనాలు ఏ విధంగా అర్ధం చేసుకుంటారనే సోయి కూడా లేకుండా ఏమి రాసినా నమ్మేస్తారులే  అన్న  ధీమాతోనే తప్పుడు కథనాలు అచ్చేసేస్తోంది. ఇటువంటి తప్పుడు కథనమే ఒకటి శుక్రవారం అచ్చేసింది. తాము రాస్తున్న తప్పుడు రాతల్లో చివరకు గవర్నర్ ను కూడా వదలటం లేదు. ఏమంటే తాము రాసిన రాతలపై గవర్నర్ దాకా వెళ్ళి ఆరా తీస్తారులే అన్న ధైర్యంతోనే  ఇలాంటి తప్పుడు రాతలు రాసేస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే స్ధానిక సంస్దల ఎన్నికల వాయిదా తర్వాత జరుగుతున్న పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని టిడిపి, కాంగ్రెస్, సిపిఐ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. తమ భేటిలో జగన్ ప్రభుత్వం అరాచకాలు, అకృత్యాలపై కంప్లైంట్లు చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రతిపక్షాలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత పచ్చమీడియా సొంతంగా రాసుకున్న రాతలే మరీ విచిత్రంగా ఉంది.

 

ప్రతిపక్ష నేతలు వెళ్ళి గవర్నర్ కు ఫిర్యాదులు చేశారని రాసిన వార్తలోనే  సమాచార సేకరణపై కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా ఇతరత్రా మార్గాల్లో కూడా సేకరిస్తోందని చెప్పింది. అయితే  ప్రతిపక్షాల నేతలు ఫిర్యాదు చేసిన కొద్ది సేపటికే ’స్ధానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలపై మీ వద్ద ముఖ్యమైన ఆధారాలుంటే పంపించండి’ అని రాజ్ భవన్ వర్గాలు తెలుగుదేశంపార్టీని కోరిందని రాసింది.

 

ఈ రాతల్లోనే పచ్చమీడియాదంతా తప్పుడు రాతలని తేలిపోతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికారపార్టీ దౌర్జన్యాలపై ఇప్పటికే చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో సహా ప్రతిపక్షాలన్నీ గవర్నర్ ను రెండుసార్లు కలిసి ఫిర్యాదు చేశారు. పైగా బిజెపి నేతలు ప్రత్యేకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.  మళ్ళీ జగన్ కు వ్యతిరేకంగా  ప్రత్యేకంగా టిడిపి నేతలను ఆధారాలు కోరాల్సిన అవసరం రాజ్ భవన్ కు ఏముంటుంది ?

 

ఒకవేళ అంతగా ఆధారాలు కావాలంటే బిజెపి నేతలనే అడుగుతారు కాని టిడిపిని కోరే అవకాశమే లేదు. ఎందుకంటే సొంతపార్టీ బిజెపిని వదిలేసి నరేంద్రమోడి, అమిత్ షా దూరంగా ఉంచుతున్న చంద్రబాబును గవర్నర్ కోరుతారా ? ఏమిటో జగన్ కు వ్యతిరేకంగా  పచ్చపైత్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఆ పైత్యంలో ఏమి రాస్తున్నారో కూడా చూసుకోవటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: