నిర్భ‌య కేసులో నిందితులు ఆరుగురు.. ఇందులో ఒక‌రు మైన‌ర్ కూడా ఉన్నాడు.. అత‌డు కొన్నాళ్లు జైలు శిక్ష అనుభ‌వించి విడుద‌ల అయ్యాడు. ఇక మ‌రొక‌రు రామ్‌సింగ్ జైలులో ఉరివేసుకుని జైలులోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇక మిగిలిన న‌లుగురు దోషుల‌కు ఈ నెల 20న తెల్ల‌వారుజామున ఉరిశిక్ష‌ను అమ‌లు చేశారు. అయితే.. ఇప్పుడు అంద‌రి దృష్టి నిర్భ‌య కేసులో మైన‌ర్ నిందితుడిపై ప‌డింది. అత‌డు ఎక్క‌డ ఉన్నాడు..? ఏం చేస్తున్నాడు..? అని ఆలోచిస్తున్నారు. అత‌డు ఎక్క‌డ ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలిసింది. ఎప్పుడో జైలు నుంచి రిలీజైన అత‌ను ద‌క్షిణ భార‌త దేశంలో .. ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌ని ప్రాంతంలో ప‌నిచేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలోనే ర‌హ‌స్య జీవితం గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. మైన‌ర్ నిందితుడు ఢిల్లీకి 220 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన వాడు. 11 ఏళ్ల‌కే ఇల్లు వ‌దిలి వ‌చ్చిన ఆ మైన‌ర్‌ను బ‌స్సు ఓన‌ర్‌ రామ్ సింగ్ చేర‌దీశాడు. 

 

బ‌స్సు ఓన‌ర్ అయిన రామ్ సింగ్‌.. ఆ మైన‌ర్‌కు క్లీన‌ర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. అయితే.. ఢిల్లీలో నిర్భ‌య‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగిన రోజున అక్క‌డే ఉన్నాడు.  అత‌ను కూడా నిర్భ‌య‌పై రేప్‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది.  రేప్ కేసులో దోషిగా తేలిన మైన‌ర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు.  ఆ త‌ర్వాత అత‌న్ని విడుద‌ల చేశారు. అయితే ఢిల్లీకి దూరంగా అత‌న్ని పంపిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.  జైలులో ఉన్నప్పుడు ఆ మైన‌ర్ వంట నేర్చుకున్నాడు. ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త‌దేశంలో అత‌ను ఓ వంట‌వాడిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. అత‌ని ఆన‌వాళ్లు ఎవ‌రికీ తెలియ‌దు. ఎప్పుడూ అత‌ని ముఖాన్ని క‌ప్పివేయ‌డం వ‌ల్ల ఆ మైన‌ర్‌ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేరు. ఇదిలా ఉండ‌గా, అత‌నిపై  పోలీసులు ఎప్పుడూ నిఘా పెట్టి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: