అతను ఓ డాక్టర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు.. రోగం వచ్చిందని వస్తే ఎంతో మందికి వైద్య చికిత్స అందించాడు.. కానీ ఇప్పుడు భయంకరమైన కరోనా వైరస్ ప్రభావంతో ఆ డాక్టర్ కే దిక్కులేకుండా పోయింది. తాను ఒక డాక్టర్ అని చెప్పినా..కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని 4హాస్పిటళ్ల చేర్చుకోమంటూ తిరస్కరించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రబావం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.. వైద్యులకు కూడా తప్పని దారుణమైన పరిస్థితి.

 

 రాష్ట్రవ్యాప్తంగా 49కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇదే పరిస్థితి.  గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రైవేట్ హాస్పిటళ్లు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించాయని జిల్లా ఆరోగ్య అధికారులు చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించగానే మా హాస్పిటల్‌లో చేర్చుకోమంటూ చేతులెత్తేశారు. అయితే ఈ వైద్యుడు విదేశాలకు వెళ్లాడా.. లేద కరోరా బాధితుడికి చికిత్స చేసే సమయంలో ఈ వైరస్ ఎటాక్ అయ్యిందా అన్న విషయంపై వైద్యులు ఆరా తీస్తున్నారు.  సదరు బాధితులు వారం క్రితం కొల్హాపూర్ నుంచి సొంత గ్రామమైన భుసావాల్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి జ్వరంగా ఉంది. బుధవారం రాత్రి జ్వరం పెరుగుతుండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

 

ఆ తర్వాత పలు ఆసుపత్రులు తిప్పినా లాభం లేకపోయింది. ఇక్క ఉన్న సదుపాయాలకు మించి వైద్య సహాయం అందించాలని మరెక్కడికైనా తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.  ఇక లాభం లేదనుకొని జిల్లా కలెక్టరును కలిశారు.  ట్రీట్‌మెంట్ ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందని మామూలు రక్త పరీక్షలు నిర్వహించామని వైద్యులు చెప్పారు.  అతని ఆరోగ్య పరిస్థితి అలానే ఉండడంతో వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని అన్నారు.  ప్రస్తుతం కరోనా ఎక్కువగా విదేశాల నుంచి వస్తున్నవారికే వస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: