ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనుకుంటున్న తరుణంలో  ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా  వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఎన్నికల సంఘం. అయితే దీనిపై ఎన్నో నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది అంటూ తెలిపారు. దీంతో ఆరు వారాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రక్రియను మళ్ళీ మొదటినుంచి నిర్వహించాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లినా కోర్టు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఈ క్రమంలో వైసిపి లోని కొంతమంది నేతలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు . కొంత మంది ప్రజలు నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇంకొన్ని సర్దుబాట్ల కారణంగా... మరికొన్ని ప్రతిపక్షాలను నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేయడం వల్ల ఏకగ్రీవమయ్యాయి.. ఏదేమైనా ఏకగ్రీవమైన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన నేతలు ఆందోళన చెందుతున్నారు. 

 

 

 ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు బిజెపికి మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మొదటి నుండి ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేయాలి అంటూ పట్టుబడుతున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలంటూ కోరుతున్నాయి  బిజెపి జనసేన పార్టీలు. ఈ నేపథ్యంలో తిరిగి మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏమిటనే దానిపై ఓ పెద్ద ప్రశ్న నెలకొంది. దీంతో వీరికి కొత్త సమస్య ఎదురవుతుంది. ఇక ఎన్నికల సంఘం విధించిన వాయిదా సమయం ఆరు వారాలపాటు.. అనుచరులను పార్టీ కార్యకర్తలను పోషించడం కూడా అభ్యర్థులకు కాస్త కష్టతరమైన పని నేతలు వాపోతున్నట్లు  తెలుస్తోంది. దీంతోపాటు ఈ వాయిదా కాలంలో ఓటర్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నేతలపై. దీంతో వైసిపి అభ్యర్థులు అందరికీ టెన్షన్ టెన్షన్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: