భయంకర కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కరోనా సోకిన 16 మంది విదేశాల నుంచి వచ్చినవారే. ఇక కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తిగా చెందుతుందో, అంతకంటే వేగంగా కరోనా వ్యాప్తి పెరగకుండా తెలంగాణలోనే కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ రాష్ట్రంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అలెర్ట్ అయ్యారు. నిరంతరం వైద్యులు, అధికారులతో చర్చలు చేస్తూ, ఎపట్టికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు.

 

ఇటు సీఎం కేసీఆర్ కూడా ఈ కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు పలు జాగ్రత్తలు చెప్పారు. ఇక ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సినిమా హళ్ళు, మాల్స్, విద్యాసంస్థలు మూసివేసింది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారిని గుర్తించేందుకు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నేషనల్, స్టేట్ హైవేలపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు స్క్రీనింగ్ చేసి, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించి హోం క్వారంటైన్‌ చేస్తున్నారు.

 

అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం బాగా పని చేస్తుందని పలువురు ప్రముఖులు కితాబు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కేసీఆర్ సర్కార్‌పై ప్రశంసలు కురిపించింది. కరోనా పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల్లో ఎప్పటికప్పుడు కరోనా పట్ల అవగాహన పెంచుతున్నారని అన్నారు.

 

అలాగే ప్రజలు శానిటైజర్స్ ఉపయోగించుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రధాని మోడీ సూచనలు దేశ ప్రజలు పాటించాలని, ఆయన చెప్పినట్లుగా అందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. మొత్తానికైతే ఈ టాలీవుడ్ సీనియర్ భామ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: