నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరుతో వచ్చిన ఓ లేఖ ఏపీ సర్కారును బద్ నాం చేసింది. దాన్ని తెలుగు పచ్చ పత్రికలు హైలెట్ చేసి ఏపీ సర్కారు పరువు తీయాలని ప్రయత్నించాయి. ఇందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా నోరు విప్పకుండా మౌనం వహించి తన వంతు సాయం చేసినట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డల బంధాన్ని బట్టబయలు చేసేందుకు జగన్ ఓ ప్లాన్ వేశారు.

 

 

అందులోభాగంగానే.. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ పేరుతో సర్క్యూలేట్‌ అయిన లేఖపై ఈ సందర్భంగా వారు డీజీపీ ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, కైలే అనిల్‌ కుమార్‌, పార్థసారథి, మల్లాది విష్ణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా ఈ లేఖను సర్క్యూలేట్‌ చేసినట్టుగా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

ఇప్పుడు ఈ లేఖపై విచారణ జరుగడం ఖాయంగా కనిపిస్తోంది. లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బృందం డీజీపీని కోరింది కూడా. రమేష్‌కుమార్‌ పేరిట ప్రచారంలోకి వచ్చిన లేఖతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక సమాచారాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డీజీపీకి అందజేశారు. ఇప్పుడు దీని ప్రకారం విచారణ జరిగితే.. చంద్రబాబు, నిమ్మగడ్డలకు దిమ్మతిరిగే అవకాశం పుష్కలంగా ఉంది.

 

 

ఎందుకంటే.. నిమ్మగడ్డ కు ఎస్ ఈసీగా విచక్షణ అధికారం ఉంటే ఉండొచ్చు. కానీ ఈ విచారణలో కుట్రపూరితంగానే ఇదంతా జరిగిందని ఏపీ పోలీసులు రుజువు చేస్తే.. ఇద్దరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం చంద్రబాబు, నిమ్మగడ్డల మెడుకు చుట్టుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఎంత వరకూ వెళ్తుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: