ఐడియా ఒక్క జీవితాన్ని మరిచేస్తుందే లేదే తెలియదు కానీ. పెళ్లి మాత్రం అమ్మాయి జీవితాన్ని మార్చేస్తుంది. పెళ్ళికి ముందు అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. కానీ పెళ్లి తరవాత అమ్మాయి జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది. కొన్ని సార్లు కట్టుకున్న వాడే దేవుడవుతాడు. మరి కొన్నిసార్లు కట్టుకున్న భర్తే యముడు అవుతాడు. నమ్మిన వచ్చిన భార్యను కడ తేర్చడానికి కూడా వెనుకాడటం లేదు నేటి సమాజంలో.

 

 

తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని మంచి స్థాయిలో ఉన్న అబ్బాయి ఇచ్చి పెళ్లి చేస్తే తన కుతురు బాగుపడుతుంది అంటారు. అలాగే ఓ తండ్రి తన కుతురుకి  ప్రజల్నీ రక్షించే గౌరవప్రదమైన వ‌ృత్తిలో ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తండ్రికి తెలీదు అల్లుడే తన కుతురి పాలిట మృత్యుదేవుడు అవుతాడని. భార్యను బాధ్యతగా చూసుకోవాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించాడు. వేధింపులు తాళలేని ఆ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాడికి మండలం చందన లక్షుంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

 

 

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన దాసరి ఓబులేసు కుమార్తె కవితను లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఓబులాపుంర రాజు కొడుకు క‌ృష్ణకు ఇచ్చి నాలుగేండ్ల కిత్రం వివాహం చేశారు. వివాహ సమయంలోనే రూ.2 లక్షలు, 15 తులాల బంగారం, పామిడిలో రెండు సెంట్ల స్థలాన్ని కట్నం కింద ఇచ్చారు. కృష్ణ పెద్దవడుగూరు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు, 14 నెలల కూతురు ఉన్నారు.

 

 

చిటికీమాటికీ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు భార్య పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం సైతం తెచ్చి ఇచ్చింది. అయినా మరింతగా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేస్తున్నాడు. చిటికీమాటికీ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: