దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 195కు చేరింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన 2,20,313 మంది పడగా, ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మనుషులు పిట్టల్లా రాలుతున్నారు.  కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అన్ని దేశాలూ  కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  అయితే భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు ఎక్కువగా విదేశా నుంచి వస్తున్న పర్యాటకులు, జాబ్ హోల్డర్స్ కి మాత్రమే వచ్చింది.

 

కాగా, దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20 మంది కోలుకున్నారు. పలు ఆసుపత్రుల్లో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్యులు సమర్థవంతంగా చికిత్స అందిస్తున్నారు. కరోనా వల్ల వృద్ధులకే అధిక ముప్పు ఉంటుంది.  తాజాగా కరోనా ఎఫెక్ట్ తో దేశంలో మరో మరణం సంబవించింది. శుక్రవారం నాడు ఇటలీ టూరిస్టు కరోనా వైరస్‌తో జైపూర్‌లో మృ‌తి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ వైరస్ సోకిన.. మృతుడి భార్య మాత్రం కోలుకొంది. కరోనాతో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. ఒక విదేశీయుడు కూడా చనిపోయాడు.  

 

అయితే ఇటలీ నుంచి ఓ బృందం ఇటీవలే భారత్‌కు వచ్చింది. జైపూర్‌లో పర్యటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో..వీరిని వైద్యులు పరీక్షించారు. అందులో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. వీరికి చికిత్స అందిస్తున్న సమయంలోనే ఇతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అత్యవసరమైతే..తప్ప..బయటకు రావద్దని సూచిస్తున్నారు.  ఈ కరోనా మహమ్మారి వల్ల భారత్ లో విదేశీయులకు బాగా ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: