ఇన్నాళ్లుగా నిదురలేని రాత్రులు గడుపుతూ, ప్రతిక్షణం గుర్తుకు వచ్చే అమ్మా అనే పిలుపును గుండెల చాటున బాధగా దాచి, అనుక్షణం కన్నీటితో తడిసిన ఆ తల్లి హృదయం ఈ రోజుతో గర్వంగా హర్షిస్తుంది.. ఇప్పుడు ఆ తల్లి మనసుకు ఎంత ప్రశాంతత లభించిందంటే.. ఎనిమిది సంవత్సరాలుగా తాను పడిన నరకం, కోల్పోయిన జీవితం అవేవి గుర్తుకు రావడం లేదు.. తన బిడ్డకు న్యాయం జరిగింది.. అనే ఆనందం తన చుట్టు ఆవహించింది.. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో.. ఒక తల్లి తన కూతురు కోసం పడే ఆవేదన ఎంత బలమైందో.. ఈ నిర్బయ తల్లి నిరూపించింది..

 

 

తొమ్మిది మాసాల పంటను అడవి పందులు వచ్చి పాడుచేస్తే ఏ తల్లి ఊరుకోదని నిరూపించింది.. మదమెక్కిన మదపుటేనుగుల మదమణిచి తన నిర్భయ ఇలాంటి మృగాలపాలిట యమ పాశాన్ని పట్టుకుని ఇంకా సంచరిస్తుందని తెలియచేసింది.. తన పై ఆరు తోడేళ్లు అత్యంత పాశివికంగా అఘాయిత్యానికి పాల్పడి చలి రాత్రిలో, కదులుతున్న బస్సులో నుంచి నగ్నంగా బయటకు విసిరేసిన ఘటన ప్రపంచం మరచిన ఆ తల్లి మాత్రం మరవలేదు.. నిర్బయ పరిస్థితిని చూసి డాక్టర్లు సైతం చలించి పోయారు. ఆమె పేగులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశారు. జననాంగంలో పదే పదే ఇనుపచువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. అయినా ఆమెను బ్రతించడం కోసం సింగపూర్ తరలించారు..

 

 

కానీ తాను ఈ మృగాల మధ్య ఉండలేనని ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకుంది.. ఒక ఆడపిల్లగా ఆ నిర్భయ అనుభవించిన నరకం గురించి వింటే మనుషుల్లో కృరత్వం ఎంతలా పెరిగిపోయిందో తెలుస్తుంది.. ఇక ఈ ఘటనలో అరెస్ట్ ఐన వారిలో ఒకడి పాపం పండి అప్పుడే చచ్చాడు.. ఒకడు మూడేళ్లు శిక్ష అనుభవించి బ్రతికి బయటపడ్డాడు.. కాగా ఈ నలుగురు మాత్రం ఇన్నాళ్లుగా పందుల్లా మేస్తూ బ్రతడానికి ఆరాటపడ్డారు.. ఇందులో ఒకడైతే తన దేహాన్ని దున్నపోతులా పెంచాడు..

 

 

ఇప్పుడు వీళ్లు పడిన ఆరాటం అప్పుడు నిర్భయ పడింది.. అది గుర్తుకు రాలేదేమో.. ఇక చావునుండి తప్పించుకోవాలని నక్కజిత్తుల వేషాలు ఎన్నో వేసారు.. అయినా ఒక ఆడపిల్ల ఉసురు అంతలా పోసుకున్న ఈ పాపాత్ముల పాపం పండటానికి 8 సంవత్సరాలు పట్టింది.. ఆ తల్లి కల, పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది.. కానీ కఠినమైన హలాహలాన్ని కడుపులో దాచుకుని ఆ తల్లి చేసిన పోరాటం నిజంగా అభినందనీయం.. అందుకే అంటారు.. అన్యాయం తాత్కాలికంగా గెలిచిన దానికి విలువ ఉండదు.. అదే న్యాయం గెలవడానికి సమయం పట్టినా అది శాశ్వతంగా నిలిచిపోతుంది.. అందుకే మనుషులుగా బ్రతకడానికి అలవాటుపడని పశువులకు ఇలా జరగాలని, అన్యాయమై పోయిన ప్రతి తల్లి మనస్సు ఇలాగే ఆలోచిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: