ఇన్నాళ్లకు నిర్భయకు న్యాయం జరిగింది. దేశం తలదించుకునేలా అత్యాచారం జరిగిన 8 ఏళ్లకు నిర్భయకు న్యాయం జరిగింది. నిర్భయ దోషులను ఉరికంబాలకు వేలాడ దీశారు. అయితే ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఇన్నాళ్లూ జనం నోళ్లలో నానిన అతి అరుదైన కేసుల్లో ఇదొకటి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి.

 

 

అందులో అనేక ఆసక్తికరమైన కోణాలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో ఇదొకటి. నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో పవన్ గుప్తా అనే దోషికి సంబందించిన విషయం ఇంట్రస్టింగ్ గా ఉంది. నేరం జరిగిన సమయంలో ఇతనికి 19 ఏళ్లు. ఇతడో పండ్ల వ్యాపారి.

నిర్భయ కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిన ఈ పవన్ గుప్తా.. జైల్లో నుంచే డిగ్రీ పూర్తి చేయడం విశేషం.

 

 

సాధారణంగా జైలు శిక్ష పడినవాడికి జీవితంపై పెద్దగా ఆశలు ఉండవు. మరి ఎలాగైనా తాను ఈ కేసు నుంచి బయటపడతాననుకున్నాడో.. లేక జైల్లో ఉండి ఏం చేయాలో తోచలేదో తెలియదు కానీ.. జైల్లో ఉన్న ఎనిమిదేళ్లలో ఇతడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నిర్భయ కేసులో శిక్ష పడిన నలుగురిలో ఇతడి ట్రాక్ రికార్డు కాస్త పరవాలేదనే చెప్పాలి.

 

 

అసలు ఈ నిర్భయ అత్యాచార ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలుత పవన్ గుప్తా వాదించాడు. కానీ కుదలేదు. ఆధారాలు స్పష్టంగా ఉండడంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అసలు ఆరోజు ఆ ప్రాంతంలో తన కొడుకు లేనే లేడని పవన్‌ తండ్రి కూడా వాదించాడు. కానీ, అదంతా కొడుకును కాపాడుకునేందుకే అని రుజువైంది. మొత్తానికి దేశాన్ని కదిలించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. నిందితుల పైశాచికత్వాన్ని చెవులారా విన్న న్యాయస్థానం ఎట్టకేలకు వారికి ఉరి తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం అమలు చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: