ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వార్తలే.. ఆ దేశంలో ఇంత మంది పోయారు.. ఈ దేశంలో ఇంత మంది పోయారు. అని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. అమెరికాలో పది లక్షల మంది.. బ్రిటన్ లో ఐదు లక్షల మంది కరోనాతో చచ్చిపోతారని ఓ నివేదిక కూడా వచ్చింది. ఇక ఇటలీలో అయితే మృతుల సంఖ్య చైనాను దాటి పోయింది.

 

 

అయితే కరోనా సంగతి తర్వాత అసలు వచ్చే నెల 19 నాటికి అసలు ప్రపంచంపై మనిషే బతికే అవకాశం లేదంటూ ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. 2020లోనే భూమి అంతం కానుందని, ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే.. ఓ పెద్ద గ్రహశకలం ఈ ఏప్రిల్‌ 19న భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనుందట. ఈ విషయాన్ని గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా చెప్పింది.

 

 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఏప్రిల్‌ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందట. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందట. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదట. ఇంతకుముందు ఇలాంటి గ్రహ శకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లినా ఇంత పెద్ద శకలం మాత్రం ఇదే మొదటిసారట.

 

 

అసలు గత 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదేనని నాసా కూడా చెబుతోంది. అయితే ఆ గ్రహశకలం భూమిని తాకుతుందని భూగ్రహం అంతమవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. నాసా మాత్రం ఆ ఛాన్స్ లేదంటోంది. అవసరమైతే.. ఏప్రిల్‌ 19న ఈ గ్రహశకలాన్ని టెలిస్కోపుతో చూడొచ్చట. మరి ట్రై చేస్తారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: