కరోనా వైరస్ బూచి తెలంగాణాను కూడా వదలలేదు.  చైనాలో పుట్టిన ఆ వైరస్ ప్రపంచ దేశాలను వణికించేసినట్లే తెలంగాణాను కూడా హడలెత్తించేస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణా మొత్తం మీద 17 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీళ్ళందరినీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తోంది. సరే వీళ్ళ విషయాలను పక్కనపెట్టేస్తే రాష్ట్రం మొత్తం మీద క్వారంటైన్లలో ఎంతమంది ఉన్నారో తెలుసా ?  ప్రభుత్వ లెక్కల ప్రకారమే  2185 మందున్నారు.

 

వీళ్ళంతా విదేశాల నుండి వచ్చిన వారే కావటం గమనార్హం. తెలంగాణాలో కరోనా వైరస్ పెరిగిపోవటానికి ప్రధాన కారణం విదేశాల నుండి వచ్చిన వారే. ఎలాగంటే ఇప్పటికే వైరస్ సోకిన వాళ్ళను ఆయా దేశాలు బలవంతంగా ఎవరి దేశాలకు వాళ్ళని పంపించేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా, వియత్నాం, ఇటలీ, బ్రిటన్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల నుండి తెలంగాణాకు వచ్చేస్తున్నారు.  వీళ్ళు తిరిగి వచ్చినపుడు దిగేది శంషాబాద్ విమానాశ్రయంలోనే కాబట్టి ఇక్కడే అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి.

 

స్క్రీనింగ్ లో అనుమానితులను లేదా కరోనా ఉందని కన్ఫర్మ్ అయిన వాళ్ళని వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించేస్తున్నారు. వైరస్ సోకిన వాళ్ళని విడిగా ఉంచి ప్రత్యేకంగా వైద్యం అందిస్తోంది ప్రభుత్వం. చైనా నుండి హైదరాబాద్ కు 35 మంది వచ్చారు. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేసిన ప్రభుత్వం ఒకిరికి వైరస్ ఉందని నిర్ధారించింది. వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మిగిలిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళల్లోనే ప్రత్యేకంగా ఉండాలని సూచించింది.

 

గడచిన నెల రోజులుగా విదేశాల నుండి తెలంగాణాకు వేలల్లో వచ్చారు. వాళ్ళంతా వివిధ కారణాలతో విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారే. అలాగే వైరస్ సమస్యతో విదేశాలు పంపించేస్తే తిరిగి తెలంగాణాకు వచ్చిన వారూ ఉన్నారు. ఇటువంటి వారందరికీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం .  విదేశాల నుండి వచ్చిన వారిని కనీసం 14 రోజుల పాటు ఎవరితోను కలవకుండా ప్రత్యేకంగా ఉండాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: