కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఒక్క ఆట ఆడిస్తుంది. మన దేశంలోను ఇప్పటికే కొన్ని కేసులు నమోదైయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో ఈ వ్యాధితో ఐదుగురు చనిపోయారు. అయితే తాజాగా తెలంగాణలో కరోనా కేసులు పాజిటివ్ గా వచ్చాయి. వారు మలేషియా నుండి వచ్చిన వారీగా గుర్తించి వారికీ  వైద్య సేవలు అందిస్తున్నారు. దింతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుంది. 

 

 

కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌‌కు వచ్చిన ఇండోనేసియా బృందం కరోనా వైరస్‌ను వెంటబెట్టుకొని ఇండియాకు వచ్చింది. ఈ 10 మంది బృందంలోని ఏడుగురికి కరోనా సోకడంతో తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. మలేషియా బృందం ఫిబ్రవరి 24న జగిత్యాల వెళ్లి వచ్చారని అధికారులు గుర్తించి వివరాలు వెల్లడించారు. ఈ బృందాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడి ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

 

 

ఇది ఇలా ఉండగా అటు నల్గొండలోనూ వియత్నాం దేశస్థులు ఉండడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లాలో 14 మంది పర్యటనకు వచ్చారు. వారు వియత్నామీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్ ఖానా సమీపంలో ప్రార్థనా మందిరంలో గురువారం రాత్రి పెద్దలు, ఇద్దరు చిన్నారులు సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యులు, అధికారుల సూచనలతో వారందరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

 


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. విదేశీయులు వచ్చిన వారు ఎక్కడా పర్యటించకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికులందరికీ కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా విదేశీయులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచనలిచ్చారు. ప్రస్తుతం అటు దేశంలోనూ.. ఇటు కరీంనగర్‌లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: