దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో భారత దేశ ప్రజలు తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దేశంలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో నిన్న జాతినుద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాది దేశ ప్రజలందరి లో ధైర్యం నింపిన  విషయం తెలిసిందే. కరోనా  వైరస్ గురించి దేశ ప్రజలందరూ దృఢ  సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే దేశ ఆరోగ్యం అంటూ చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ... ప్రజల అందరి సహకారంతోనే కరోనా  మహమ్మారిని జయించవచ్చు పిలుపునిచ్చారు. 

 

 ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఈ నెల 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దేశంలోని అందరూ ఇళ్లలోకి పరిమితం కావాలని... ఒక్కరు కూడా బయటకి రాకూడదు అంటూ సూచించారు. అయితే ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కి  దేశవ్యాప్తంగా మంచి మద్దతు వస్తోంది. ఇక తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కి  పిలుపునివ్వడం మంచి పరిణామం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ మనం పాటించకపోతే ఆ తర్వాత ప్రభుత్వం చట్టబద్ధంగా అమలు చేసే అవకాశం ఉంది అంటూ ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు. 

 

చైనా తరహాలోనే మనం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఒక ప్రాంతంలో కరోనా వైరస్ 12 గంటల పాటు బతికే అవకాశం ఉంటుంది అంటూ తెలిపిన నాగబాబు... జనతా కర్ఫ్యూను 14 గంటలపాటు పాటించడంవల్ల... జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సజీవంగా ఉన్న వైరస్ నాశనం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కరోనా వైరస్ ను  కొంచెంకొంచెంగా నియంత్రించవచ్చు అంటూ తెలిపారు. అంతకు ముందుగా దేవుళ్లకు మొక్కడం మాని సైంటిస్టులకు మొక్కితే బెటర్ అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: